బయట కొస్తే పొత్తులో ఉన్నామని.. నాలుగ్గోడల మధ్య అయితే జనసేన తో మనకి పొత్తు లేదని బీజేపీ పెద్దలు చెప్తుంటారని ఆ పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీ లో చేరిన కన్నా ఓ టీవీ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు మొత్తానికి విశ్లేషకులను అయోమయంలో పడేసాయి.. జనసేన పదే పదే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వమని చెప్తున్నప్పటికి బీజేపీనేతలు అదంతా తూచ్… అంటూ రహస్య స్నేహం పదిలం అన్నట్టే ఉంటుంది.. ఇదిలా వుంటే మినీ సార్వత్రిక ఎన్నికల లాంటి ఎమ్మెల్సీ ఎన్నికల లో జనసేన పొత్తుతో పోటీ చేస్తున్నామని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ప్రకటించింది.. పొత్తు తో వెళ్తున్నారా..? బిజెపి స్వంతం గా వెళ్తుందా.. అన్నది పక్కన పెడితే ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారాన్ని బీజేపీ మాత్రమే ప్రకటించుకుంది.. ఈ పొత్తు పై మాత్రం ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ గాని జనసేన పెద్దలు గాని నోరు మెదపలేదు. టిడిపి విషయం పక్కన పడితే మొదటినుంచి పొత్తులో ఉన్నామని చెబుతున్న బిజెపి జనసేన నేతల మధ్య ఎమ్మెల్సీ ఎన్నికలు ముందుకు రావడం ఇప్పుడు అసలు ఆ రెండు పార్టీలు కలిసి ఉన్నాయా లేదా అనే దానిపై చర్చ జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి గాని జరుగుతున్న సంఘటనలకు గాని జనసేన నేతలు లేదా స్వయంగా పవన్ కళ్యాణ్ మీడియా ద్వారా స్పందిస్తూ తమ అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటారు. అది కుదరకపోతే పార్టీ తరఫునుంచి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇచ్చే విషయమై నేరుగా కాకపోయినా కనీసం ప్రశ్నలు ద్వారా అయినా తెలియజేస్తే బాగుండేదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన మాత్రం టిడిపి తో జత కట్టేందుకు సిద్ధమవుతొందని వార్తలు వినిపిస్తున్న నేపద్యంలో ఏపీ బీజేపీ నేతలు పలు సందర్భాలలో పలు సమావేశాలలో అవసరం వున్నా లేకపోయినా జనసేన తోనే ఉన్నామని స్పష్టంగా చెబుతున్నారు. కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీకి ఫేవర్ గా ఎక్కడ కూడా నోరు మెదపడం లేదు. రెండు జండాలు కలిసి ఎక్కడా కనిపించలేదు.. చివరాఖరికి నామినేషన్ల ఘట్టం లో కూడా జనసేన లోని చిన్న నాయకులు కూడా లేరంటే పరిస్థితి ని అర్ధం చేసుకోవచ్చు వైసిపి ప్రభుత్వం జనసేన నేతలనే కాకుండా పవన్ కళ్యాణ్ ను కూడా టార్గెట్ చేసిన బిజెపి సీరియస్ గా స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ను వైసిపి నేతలతో బిజెపి ఏపీ నేతలకు సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారంతో పవన్ కళ్యాణ్ ఆ పార్టీకి దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. వచ్చే ఎన్నికలలో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే తన లక్ష్యంగా పవన్ కళ్యాణ్ ఇప్పటికే చాలాసార్లు స్పష్టం చేశారు. వైసీపీతో అంట కాగుతున్న బిజెపితో అది సాధ్యం కాదని తెలిసి తప్పని పరిస్థితిలో టిడిపి తో జత కట్టేందుకు పవన్ కళ్యాణ్ సిద్ధమవుతున్నట్లు ఆఫ్ ది రికార్డు గా ఆ పార్టీ నేతలే చెప్తున్నారు.. ఇటీవల చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ నేరుగా కలుసుకోవడంతో పాటు అన్ స్టాపబుల్ ప్రోగ్రాంలో నందమూరి బాలకృష్ణ తో మరింత దగ్గర అయ్యారు.అయితే ఏపీలోని మొత్తం తొమ్మిది స్థానిక సంస్థల ఎమ్మెల్సీ, మూడు గ్రాడ్యుయేట్, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అటు టిడిపి ఇటు బిజెపి జనసేన మద్దతును ఆశిస్తున్నాయి. జనసేన మద్దతుపై టిడిపి బయటకి చెప్పకపోయినప్పటికీ పవన్ కళ్యాణ్ తమ వైపే ఉన్నారని ఆ పార్టీ భావిస్తుంది. ఇక బిజెపి నేతలు బిజెపి కేంద్ర కమిటీ పవన్ కళ్యాణ్ కు ఇస్తున్న ప్రియారిటిని గుర్తించి ఎమ్మెల్సీ ఎన్నికలలో మద్దతు ఇస్తున్నట్లు కనీసం ఒక వీడియో అయినా ఆ పార్టీ నేతలతో విడుదల చేస్తే బాగుండేదని ఏపీ బిజెపి నాయకులు అభిప్రాయపడుతున్నారు. పవన్ కళ్యాణ్ పై మాత్రం ఎమ్మెల్సీ ఎన్నికల ఒత్తిడి కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న సమయంలో తమ పార్టీ నుండి అభ్యర్థులను బరిలోకి దించే పరిస్థితి లేకున్నప్పటికీ విపరీతమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మార్చి 13వ తేదీన ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈసారి ఎమ్మెల్సీ ఎన్నికలను అన్ని పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న వైసిపి అన్ని స్థానాలను కైవసం చేసుకోవాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటే, అటు బిజెపి, ఇటు టిడిపి సైతం ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టు సాధించడం కోసం ప్రయత్నిస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు వైసిపి ఖాతాలోనే పడే అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో పవన్ పై విపరీతంగా ఒత్తిడి కనిపిస్తుంది. ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం నుండి, తమ సిట్టింగ్ స్థానం కోసం మళ్ళీ ఎన్నికల బరిలోకి దిగిన బీజేపీ జనసేన, ఉమ్మడి అభ్యర్థిగా మాధవ్ ను బరిలోకి దించింది. బిజెపితో పొత్తులో ఉన్న పవన్ కళ్యాణ్ బిజెపికి సంపూర్ణ మద్దతును ప్రకటిస్తూ తమ బంధం పై వస్తున్న ఆరోపణలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాలని కోరుకుంటోంది