ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ లొనే ఉంటారని.. స్వప్రయోజనాలు తప్ప ప్రజల బాగోగులు ఏమాత్రంపట్టించుకోరని.. టాక్ ఉన్న ఆయన ఎమ్మెల్యేగా గెలిచింది తెలుగుదేశం పార్టీ నుంచే అయినా మనసు మాత్రం అధికార పార్టీ పైనే ఉందని అందరూ బహిరంగంగానే చర్చించుకుంటారు.. వైసీపీ లో చేరేందుకు గట్టిగా ప్రయత్నించినప్పటికీ ప్రయోజనం నెరవేరలేదట.. అలాగని స్వపార్టీ నుంచి ఏమైనా సపోర్ట్ ఉందంటే అది కూడా లేదు. ఎందుకంటే ఆయన టిడిపి ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి పార్టీపరంగా చేపట్టే ఎటువంటి కార్యక్రమానికి కూడా ఆయన హాజరు కాలేదు. స్వయంగా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపు ఇచ్చినప్పటికీ పార్టీ తో అంటీముట్టనట్లు వ్యవహరించారు. ఎన్నికల సీజన్ స్టార్ట్ అవుతుందన్న టైం లో మళ్ళీ అలెర్ట్ అవుతున్న ఆ టిడిపి నేత, విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. గత టిడిపి ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని అనుభవించిన ఆయన ఆ తర్వాత ఎన్నికలలో టిడిపి అధికారంలోకి రానప్పటికీ ఎమ్మెల్యే గా అయితే మాత్రం గెలిచారు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలోకి చేరిపోతాడనే ఆరోపణ ఉన్న గంటా దాన్ని నిజం చేస్తూ వైసీపీలోకి చేరేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేశారు. తన శిష్యుడిగా చెప్పుకునే భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు గంటా ఆశలకు గండి కొట్టారనే చెప్పుకోవచ్చు. ఎంపీ విజయసారెడ్డి కూడా గంటా ను తమ పార్టీలోకి చేర్చుకునేది లేదని బహటంగానే చెప్పారు. అయితే గంటా మాత్రం తన ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టే కార్యక్రమాలకు హాజరు కాకుండా డుమ్మాకుంటారు. ప్రభుత్వానికి తాను అనుకూలంగా ఉన్నట్లు సంకేతాలు పంపారు. విశాఖలో చాలా మంది టిడిపి నాయకులు పై వైసీపీ నేతలు ఆరోపణలు విమర్శలు చేసినప్పటికీ గంటా శ్రీనివాసరావు ను మాత్రం వదిలేశారు. గత టిడిపి ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యే గా కానీ, మంత్రిగా గానీ ప్రజలకు ఏమి చేసింది లేదనేది రెగ్యులర్ గా వినిపించే ఆరోపణ ఈ విషయాన్ని ఆ నియోజకవర్గ ప్రజలే బాహాటంగా చెబుతున్నారు. అక్కడ వైసీపీ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన కేకే రాజు ఎప్పుడు ప్రజలతో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేస్తుంటే స్థానిక ఎమ్మెల్యే గంటా మాత్రం ప్రజలను గాలికి వదిలేసి రాజకీయాలు చేస్తున్నారు.అటు వైసీపీలోకి రానివ్వకపోవడం, ఇటు టిడిపి పార్టీ కూడా పెద్దగా పట్టించుకోవడం, దీనికి తోడు చాలావరకు టిడిపి కేడర్ దూరంగా ఉండటం తో ఇప్పుడు అన్ని విధాలుగా ఏకాకి అయినట్లు అయిన గంటా పేరు వచ్చే ఎన్నికల్లో గల్లంతవ్వడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. విశ్లేషకుల మాట అటుంచితే 2024 ఎన్నికల్లో మళ్లీ ఆయన భీమిలీ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. తను ఏ పార్టీలో ఉన్నప్పటికీ భీమిలి నుంచే పోటీ చేస్తానని ఆయన సంకేతాలు ఇచ్చారు.ఈసారి మళ్లీ విశాఖ ఉత్తర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే గెలుపొందే అవకాశాలు చాలా తక్కువున్నట్టు ఉన్నట్లు సమాచారం. ప్రజలు లోకల్ మీడియా పూర్తిగా మర్చిపోయినప్పటికి నేను ఉన్నాను అంటూ అప్పుడప్పుడు లీకులు ఇస్తూ తన ఉనికిని చాటుకునే ప్రయత్నం చెయ్యడంతోనే సరిపోతుందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే మళ్లీ తెలుగుదేశం పార్టీ కి దగ్గరవుతున్న గంటా ఎన్నికల సమయానికి పార్టీ కి ఏ రేంజ్ డిస్టెన్స్ లో వుంటారో ఇప్పుడే చెప్పడం కష్టం.మారుతున్న రాజకీయ సమీకరణాలను బట్టి గంటాకు ఎక్కడ సీటు కేటాయించిన ఏ పార్టీలో ఉన్నా గెలిచే అవకాశాలు లేవని బల్లగుద్ది మరి చెప్తున్నారు. ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచినా గంటా తన సొంత ప్రయోజనo కొరకు మాత్రమే పనిచేస్తూ ఉంటారని అతని సన్నిహితులే చెబుతున్నారు కాపు సామాజిక వర్గం అనే పేరు తప్ప ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నది వీరి వాదన. ఈ వ్యతిరేకత గమనించే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి చేర్చుకోకుండా సున్నితంగా తిరస్కరించారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఇప్పటికి కూడా వేచి చూసే ధోరణిలోనే ఉన్న గంటా మరోవైపు వచ్చే ఎన్నికలలో జనసేన నుంచి పోటీ చేస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. విశాఖలో రాజకీయంగా కాపు సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత కావడంతో గంటాను పార్టీలోకి ఆహ్వానించేందుకు జనసేన నేతలు అభ్యంతరం చెప్పరనేది ఆయన వర్గీయుల విశ్వాసం.
previous post
next post