ఆధునిక పాత్రికేయానికి కొత్త నిర్వచనం చెప్పిన రవి ప్రకాష్ మళ్ళీ టీవీ9 గుమ్మం తోక్కారు.. రెండు తెలుగు రాష్ట్రాలు ఎన్నికల ముంగిట నిలిచి ఉన్న తరుణం లో టీవీ9 వ్యవస్థాపకుడు.. ఆ సంస్థ మాజీ సీఈఓ రవిప్రకాష్ తిరిగి అక్కడికి రావడం రాజకీయ, పాత్రికేయ వర్గాల్లో తీవ్ర కలకలం చెలరేగింది.. కొంతమంది ఎన్నారై లతో కలసి కొత్త న్యూస్ చానల్ ప్రారంభిస్తారని కొంతసేపు.. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రవిప్రకాష్ చానల్ రాబోతుందని మరికొంత సేపు వార్తలు తెగ హల్చల్ చేశాయి.. వీటిని ఎవరూ సమర్ధించను లేదు.. ఖండించనూ లేదు.. టీ ఆర్ ఎస్ ను బీఆరెస్ గా మార్చిన తరువాత కేసీఆర్ తో రవిప్రకాష్ సయోధ్య కుదుర్చుకున్నట్లు వార్తాలొచ్చాయి. పార్టీ దేశవ్యాప్త విస్తరణకు కేసీఆర్ చర్చలు జరిపినట్టుగా కూడా సమాచారం బయటకు పొక్కింది.. ఎన్ని వార్తలు చక్కర్లు కొట్టిన అజ్ఞాతం వీడి బయటకు రాని రవిప్రకాష్ తిరిగి తన మాతృసంస్థ లో కనిపించేసరికి టీవీ9 లో తిరిగి బాధ్యతలు చేపడతాడా అన్న అంచనాలు మొదలయ్యాయి.. అయితే ఆడిటింగ్ కి సంబంధించిన కొన్ని అకౌంట్లు చూసేందుకే ఇక్కడికి వచ్చినట్లు రవిప్రకాష్ వివరణ ఇచ్చారు.. తనతో పాటు జూపల్లి రామేశ్వరరావ్, మెగా కృష్ణారెడ్డి, ఎమ్ బీ కె ఎన్ మూర్తి అసోసియేటెడ్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ (ABCL) లో భాగస్వాములమని కేవలం అకౌంట్ల పర్యవేక్షణ కు మాత్రమే తానొచ్చినట్టు చెప్పినప్పటికీ ఎన్నికలు ముంచుకొస్తున్న సమయం లో ఆయన రాక రాజకీయ వర్గాల్లో కాకరేపింది. వార్త సేకరణ లోను.. న్యూస్ ప్రెజెంటేషన్ లోను నూత్న ఒరవడి ని క్రియేట్ చేసి మీడియా రంగానికి కొత్త భాష్యం చెప్పిన రవిప్రకాష్ వచ్చే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించడం మాత్రం ఖాయమని కొంత మంది కుండబద్దలు కొట్టేస్తున్నారు..
previous post
next post