తరచు విజయసాయిరెడ్డిని నందమూరి బాలకృష్ణను ట్రోల్ చేస్తే నెటిజన్స్ ఈ విషయంలో మాత్రం ఆ ఇద్దరిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.ఉప్పూ నిప్పూ లాంటి పార్టీల్లో ఉన్నప్పటికీ రాజకీయంగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కుటుంబ విషయానికి వచ్చేసరికి ఇద్దరూ ఒకటవటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. వారిద్దరి కోసం మరింతగా చర్చించుకోవడానికి అవకాశం కల్పించింది. నందమూరి తారకరత్న తీవ్ర గుండెపోటు తో హాస్పిటల్లో జాయిన్ అయ్యేప్పటినుంచి అన్ని తానే అయి చూసుకుంటున్న బాలకృష్ణ కు విజయ సాయి రెడ్డి కూడా తోడయ్యారు. తారకరత్న భార్య తరపు నుంచి ఆమె బాబాయ్ గా తాను కూడా బాలకృష్ణతో కలిసి దగ్గరుండి చూసుకోవడం జరిగింది. ఈ సందర్భంలో రాజకీయంగా బద్ధ శత్రువులైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో కొంచెం చనువుగా ఉండటం అతనితో పక్క పక్కన కూర్చోవడం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది. అలాగే మెగాస్టార్ చిరంజీవి తోను జూనియర్ ఎన్టీఆర్ తోను అయన కలిసి కూర్చుని మాట్లాడిన తీరు ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. విజయసాయిరెడ్డిలో చాలా మార్పు వచ్చిందంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. బాలకృష్ణ నందమూరి తారకత్న భార్య పిల్లల బాగోగుల కోసం భరోసా ఇచ్చారంటూ జరిగింది. ఈ ఎపిసోడ్ మొత్తం లో రాజకీయాలకు చర్చ లేదు.అటు విజయ సాయి రెడ్డి కాని ఇటు చంద్రబాబు నాయుడు కాని ఎటువంటి రాజకీయాలకు అవకాశం లేకుండా చాలా హుందాగా వ్యవహరించారు. నందమూరి కుటుంబం నుంచి పెద్దరికం తీసుకొని బాధ్యతగా, చాలా హుందాగా వ్యవహరించిన బాలకృష్ణ తీరుకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు.