మరాఠా సామ్రాజ్య స్థాపకుడు మొఘల్ సామ్రాజ్య ప్రత్యర్థి.. అరివీర భయాంకరుడు.. శక్తి యుక్తులతో పోరు గెల్చిన యోధుడు. ఛత్రపతి శివాజీ మహారాజ్. జీవితాంతం విదేశీ ఆక్రమణకారులతో జరిపిన అనేక యుద్ధాలలో వెన్నంటి ఉండి ఎల్లవేళలా సహకరించిన వాళ్ళు ఎందరో వున్నా ఛత్రపతికి అత్యంత ప్రియమైన ధన్యజీవి ఓ కుక్క.. శునకం అంటేనే విశ్వాసం.. అలాంటి కుక్కలతో ప్రపంచ వ్యాప్తంగా అత్యంత విశ్వసనీయ టాప్ టెన్ శునకాలలో చోటు సాధించుకున్న దీని పేరు “వాగ్య”. 1680లో శివాజీ మరణానంతరం హిందూ సంప్రదాయాన్ని అనుసరించి అంత్యక్రియలు నిర్వహించారు. తన యజమాని శరీరం పొగతో పైకి లేవడం చూసి కలత చెంది ఆ వాత్సల్యాన్ని వీడలేక మరణాంతరం కాలుతున్న అతని చితిపై దూకి తనువు చాలించింది వ్యాఘ్య. భారతదేశ చరిత్రలో అత్యంత విశ్వసనీయ సంఘటన ఇది. వాఘ్య భారతదేశానికి కు చెందిన మిశ్రమ-జాతి శునకం. ఒక యోధుడికి స్థిరమైన సహచరుడు.. ఉనికిని విధేయతకు, విశ్వసనీయతకు దీనికి తిరుగులేదని ఛత్రపతి చాలా సార్లు ప్రశంసించినట్టు చరిత్ర చెపుతోంది. ప్రముఖ మరాఠీ నాటక రచయిత రామ్ గణేష్ గడ్కరీ రచించిన రాజ్సన్యాస్ అనే నాటకంలో వాఘ్య యొక్క వీరోచిత కథ ను ప్రస్తావించారు.. పర్వతకోట అయినటువంటి రాజధాని రాయ్‌గఢ్ లో శివాజీ స్మారక చిహ్నాన్ని నిర్మించారు.. అయితే తదనాంతరం తన చక్రవర్తి కోసం తనువు చాలించిన వాఘ్య జ్ఞాపకార్ధం 1906 లో అప్పటి ఇండోర్ రాజు టూకోజీ హోల్కర్ ధన సహాయం తో ఐదు వేల రూపాయల వ్యయం తో ఒక స్మారక స్తూపాన్ని అక్కడే నిర్మించారు. 1936 శ్రీ శివాజీ రాయఘడ్ స్మారక సమితి దీన్ని ఏర్పాటు చేసిందని మరో కధనం కూడా వుంది. శివాజీ స్మారకం పక్కన ఓ కుక్క స్మృతి చిహ్నం ఉండకూడదు అని ఆరోపిస్తూ 2011 లో శంభాజీ బ్రిగేడ్ అనే సంస్థ దీన్ని తొలగించింది. స్థానిక ధన్గర్ అనే సామాజిక వర్గానికి చెందిన బృందం నిరసన లు చేసి తిరిగి విగ్రహాన్ని పునః ప్రతిష్టించేలా చేశారు.. వాఘ్య అంటే మరాఠీ లో పులి అని అర్థం. ఒక పెంపుడు జంతువు యజమానికి జీవితాంతం విధేయత గా ఉండడానికి ఒక ఐకాన్ గా మారిన వాఘ్యా నిజమైన త్యాగం చాలా మంది కి తెలియక పోవచ్చు కానీ.. భవిష్యత్ లో వ్యాఘ్యా భారతీయ సంస్కృతి ప్రస్తావన లో నిలిచిపోతుంది. దేశం కోసం, ధర్మం కోసం మరణించిన మనుషులకే కాదు ప్రాణాలర్పించిన జంతువులకు సైతం గౌరవాన్ని ఇచ్చి అభిమానంతో స్మారకాలు నిర్మించే మనదేశం త్యాగధనులను ఎప్పటికి హృదయాల్లో నిలుపుకునే ఉంటుంది.
previous post