బ్రహ్మ మురారి సురార్చిత లింగం.. నిర్మల భాసిత శోభిత లింగం.. బ్రహ్మ విష్ణు దేవతలంతా కలసి అర్చించిన భవుఁడు ఆ పరమేశ్వరుడు .. ఈ శివరాత్రి ఎన్నో వందల ఏళ్ళకొకసారి వస్తుందని శని త్రయోదశి కలిసిరావడం మరింత విశిష్టమని చాలా మంది చెపుతున్నారు.. అవన్నీ నిజమే అయుండొచ్చు కానీ అసలు శివరాత్రి అంటేనే పరమ పవిత్రం అత్యంత విశిష్టం.. పరమేశ్వరునికి పుట్టినరోజు అనేది ఉండదు.. స్వయంభూ, ఆత్మభూ అని పే ర్లున్న ఆ పరమ శివునికి అసలు పుట్టుకే లేదంటారు తనంత తాను కలిగినవాడు అని., ఉన్నవాడు అని రెండుగా కీర్తించినా. భగవంతుడు ఎప్పుడూ ఉన్నవాడే అయ్యినప్పటికి ఈ జగతిని అనుగ్రహించడం కోసం తనను తాను వ్యక్తం చేసుకుంటాడు.ఆ వ్యక్తంనే కలగడం చెప్తుంటారు. అందుకే శివునికి భవుడు (కలి గినవాడు) అని కూడా మనం పూజిస్తాం.. మరి ఆ భవునకు ఈ శివరాత్రి కి సంభంధం ఏంటి..? అసలు మహాశివరాత్రి ప్రత్యేకత ఏమిటీ..? సృష్ట్యారంభమునందు పరమాత్మ తనను తా ను ఒక దివ్యమైన అగ్నిస్తంభాకృతిగా ప్రకటించుకుని వ్యక్త మైన రోజే మహాశివరాత్రి అని చెప్పబడుతు న్నది. కనుక ఇది పరమశివుని పుట్టినరోజు అని కొంతమంది భక్తులు భావించినప్పటికీ భగవంతుడు తనకు తాను ప్రకటించుకున్న దివ్యమైన రోజే ఈ పవిత్ర పుణ్య దినం..దీనికి సంబంధించిన ఒక పురాణ కథ ను పరిశీలిస్తే బ్రహ్మవిష్ణువుల నడుమ పరమేశ్వరుడు ఒక మహాలింగంగా ఆవిర్భవించి తన ఆదిమ ధ్యాంత తత్త్వాన్ని చాటిచెప్పినట్టు కొన్ని గ్రంధాలు చెప్పినప్పటికీ మరికొన్ని పురాణాలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి మాఘ బహు ళచతుర్దశి అర్ధరాత్రి సమయంలో పరమేశ్వ రుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడని మరికొన్ని వాటిల్లో మార్గశీర్ష మాసం ఆర్ద్ర నక్షత్రం నాడు పరమేశ్వరుడు ఒక మహాగ్నిలింగంగా ఆవిర్భవించాడు అని ప్రస్తావించారు.ఆ ఉద్భవిం చిన మహాలింగం తుది, మొదలు తెలుసు కోవాలని ప్రయత్నించిన. బ్రహ్మ హంసరూపంతో పైకి వెళ్తే, విష్ణువు వరాహరూపంతో క్రిందికి వెళ్ళారట.. అయితే వారిద్దరూ తుది, మొదలు తెలుసుకోలేక సతమతమై తిరిగి ఆ పరమేశ్వరునే శరణు వేడ గా ఆ పరమేశ్వరుడు వ్యక్తమై వారికి తన నిజతత్త్వాన్ని తెలియజేశాడు. అప్పుడు బ్రహ్మ, వి ష్ణువులు ఉభయులూ శివారాధన చేశారు. వారిరువురు శివుని ఆరాధించిన రోజు మాఘ బహుళ చతుర్దశి అర్ధరాత్రి సమయం. ఆనాటి నుండి శివలింగారాధన వ్యాప్తి చెందిందని ప్రతీతి.. ఈ విధంగా పరమేశ్వరుడు తనను తాను వ్య క్తం చేసుకుని తన ఆరాధనను బ్రహ్మవిష్ణువు ల ద్వారా వ్యాప్తి చేసిన రోజే మాఘ బహుళ చతుర్దశి. అదే మహాశివరాత్రి. సంవత్సర కాలం శివారాధన చేసిన ఫలితం ఈ ఒక్క రోజు ఆరాధన తోనే లభిస్తుందని మనకు శాస్త్రం చెప్తున్నది. అదే మహా శివరాత్రి విశిష్టత.