టీవీ రియాల్టీ షో బిగ్ బాస్ పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిగ్ బాస్ షో కి మించిన అశ్లీల కంటెంట్ వివిధ ఫ్లాట్ ఫామ్ లద్వారా యువతకు అందుబాటులో ఉందని కోర్టు గుర్తుచేస్తూనే ఎవరు ఏం మాట్లాడాలో.. ఏం మాట్లాడకూడదో కోర్టులు డిక్టేట్ చెయ్యలేవని తెలిపింది. టీవీ లలో టెలీకాస్ట్ అయ్యే ప్రసారాలలో ఉన్న అభ్యంతరాల పై ఫిర్యాదు చేసేందుకు వేరే మార్గాలు ఉన్నప్పటికీ పిటిషనర్లు డైరెక్ట్ గా కోర్టును ఆశ్రయించారని ఈ విషయంలో వారికి అవగాహన లేకపోవడంతోనే ఇలా జరిగిందని స్టార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కోర్టుకు తెలియజేసింది బిగ్ బాస్ జరిగే విధానాన్ని కోర్టు ముందుంచాలని దీనిపై పరిపూర్ణమైన కౌంటర్ దాఖలు చేయాలని స్టార్ మా మేనేజింగ్ డైరెక్టర్ ని కోర్టు ఆదేశిస్తూనే రియాల్టీ షో అభ్యంతరకరంగా ఉందని భావిస్తే దాన్ని చూడవద్దని ప్రేక్షకులకు.. ఫిర్యాదుదారులకు సూచనలు చేసింది అంతే కాకుండా బిగ్ బాస్ షో ప్రదర్శన పై కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆదేశించింది
previous post
next post