హైదరాబాదులో మరో ఐకానిక్ కట్టడం రూపుదిద్దుకోబోతుంది ప్రపంచంలోనే అతిపెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ నిర్మాణంగా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలర్పించిన వారికి దీప నివాళులర్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ భారీ నిర్మాణాన్ని చేపట్టింది. మట్టి దీపపు ఆకృతిలో ప్రజ్వలించే జ్యోతి నమూనాతో ఎక్కడ ఎటువంటి అతుకులు కనిపించకుండా మూడెకరాల విస్తీర్ణం లో సుమారు 179 కోట్ల రూపాయల వ్యయంతో 100 టన్నుల స్టైన్లెస్ స్టీల్ 1200 టన్నుల ఇనుముతో బలమైన గాలులకు సైతం తట్టుకునేలా ఆర్కిటెక్చర్ రమణారెడ్డి పర్యవేక్షణలో దీన్ని నిర్మిస్తున్నారు దాదాపు మూడున్నర సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ విశేష కట్టడం నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి ఇప్పటివరకు స్టెయిన్ లెస్ స్టీల్ కట్టడంలో గిన్నిస్ సాధించిన చికాగోలో నిర్మాణం కంటే ఇది నాలుగు రెట్లు పెద్దదని ఈ స్మృతి చిహ్నం ఆవిష్కరణ అనంతరం ఎన్నో ప్రపంచ రికార్డులను సాధిస్తుందని ఆశాభావాన్ని ప్రభుత్వ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి దీని నిర్మాణంలో 316 ఎల్ అనే పేరు గల హయ్యర్ గ్రేడ్ స్టెయిన్లెస్ స్టీల్ వాడారు మట్టి దీపమే ప్రేరణగా హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై నిర్మితమవుతున్న ఈ స్మారక భవన్లో అమరవీరుల త్యాగాలు చాట్ చెప్పే విధంగా ఓ మ్యూజియం కూడా ఏర్పాటు చేయనున్నారు తెలంగాణ ఏర్పాటు.. ఆవశ్యకత.. పోరాటం ఎందుకు అనివార్యమైంది.. అన్న అంశాలపై అందరికీ అర్థమయ్యే రీతిలో మ్యూజియం ఉంటుందని, దానితోపాటు వందమంది కూర్చునే విధంగా ఓ మినీ థియేటర్ కూడా ఏర్పాటు చేశారు అమరుల త్యాగాలను ప్రపంచానికి చాటిచెప్పేల డాక్యుమెంటరీ చిత్ర ప్రదర్శన కూడా ఇందులో ఉండనుంది సందర్శకుల కోసం రెస్టారెంట్ , సభలు, సమావేశాల కోసం ఏడు వందల మంది కూర్చునే విధంగా ఒక ఆడిటోరియం కూడా నిర్మిస్తున్నారు 350 కార్లు 600 బైక్లు పార్కింగ్ చేసుకునే సామర్థ్యం పార్కింగ్ను కూడా ఇక్కడ ఏర్పాటు చేయనోడంతో దీని ప్రారంభం తర్వాత సందర్శకులు తాకిడి భారీగానే ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు
ప్రపంచంలో అతిపెద్ద స్టెయిన్ లెస్ స్టీల్ కట్టడం