కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద చతికల పడుతూ వస్తున్న బాలీవుడ్ సినిమాలు కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ పఠాన్ మూవీ సూపర్ హిట్ కావడంతో ఒక్కసారిగా మళ్లీ పుంజుకుంది. షారుఖ్ నుంచి నాలుగేళ్ల తర్వాత వచ్చిన సినిమా కావడంతో ‘పఠాన్’ మీద భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ప్రేక్షకుల ఆదరణతో తొలి రెండు రోజుల్లోనే సుమారు రూ. 220 కోట్లు సాధించి, సరికొత్త రికార్డు సాధించడం విశేషం. ఇందులో భారత్ నుంచే సుమారు రూ.128 కోట్లు వచ్చాయని సమాచారం. బాహుబలి మూవీ నుంచి బాలీవుడ్ పై దక్షిణాది సినిమాల ఆధిపత్యం కొనసాగుతుంది. బాలీవుడ్ సూపర్ స్టార్ లు నటించిన ఏ సినిమా కూడా దక్షిణాది పాన్ ఇండియా సినిమాలకు పోటీగా నిలబడలేకపోయింది. చాలా బాలీవుడ్ సినిమాలు పెట్టిన పెట్టుబడి తిరిగి తెచ్చుకోలేక డిజాస్టర్ లు మిగిలిపోయాయి. కొన్ని బాలీవుడ్ సినిమాలు కూడా నాలుగైదు భాషలలో డబ్బింగ్ చేసి పాన్ ఇండియన్ స్థాయిలో రిలీజ్ చేసిన ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్, రణ బీర్ కపూర్, రణవీర్ కపూర్ వంటి స్టార్ హీరోలు నటించిన సినిమాలన్నీ వరుసగా అపజయాలను మూట గట్టుకున్నాయి. సరైన హిట్ సినిమాల్లేక తీసిన సినిమాలకు పెట్టిన పెట్టుబడి రాక బాలీవుడ్ బాగా కుదేలైపోయింది. దక్షిణాది సినిమాలలో తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం చిత్రాలు బాలీవుడ్ లో తమ హవాను కొనసాగిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా తెలుగు సినిమా బాలీవుడ్ కి కొరకరాని కొయ్యగా మారింది. తెలుగులో ప్రభాస్ నుంచి జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, నిఖిల్, అడవి శేష్ లు వరకు బాలీవుడ్ లో తమ చిత్రాల ద్వారా హవా కొనసాగిస్తూ పాన్ ఇండియన్ హీరోలుగా కొనసాగుతున్నారు. త్వరలో మహేష్ బాబు కూడా రాజమౌళి చిత్రం ద్వారానే పాన్ ఇండియన్ హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. ప్రస్తుతం రాజమౌళి ఇండియన్ స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. తన సినిమాల ద్వారా జాతీయ స్థాయిలొనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మంచి గుర్తింపును పొందారు. ఇదిలా ఉండగా దక్షిణాది సినిమాల డామినేషన్ ను తట్టుకోలేని కొందరు బాలీవుడ్ స్టార్లు, డైరెక్టర్లు, క్రిటిక్స్ దక్షిణాది డైరెక్టర్ ల పైన, స్టార్స్ పైన, ఇక్కడ సినిమాల పైన పలు విమర్శలు చేస్తూ వస్తున్నారు. అయినప్పటికీ కూడా నార్త్ ఇండియన్ ఆడియన్స్ మాత్రం దక్షిణాది సినిమాలను నెత్తిన పెట్టుకొని భారీ వసూళ్లను ఇస్తున్నారు. ఇక్కడ సినిమాలలో ఉండే మంచి కంటెంట్ నార్త్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటుంది. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, హిందుత్వ గొప్పదనాన్ని, కుటుంబ విలువలను హైలెట్ చేస్తూ తీస్తున్న ఇక్కడ సినిమాలకు నార్త్ లో బ్రహ్మరథం పడుతున్నారు. అదే బాలీవుడ్ లో అయితే నాసిరకం కథలతో, సెమి న్యూడ్ ఫిలిం లను నిర్మిస్తూ వస్తున్నారు. దీంతో అక్కడ ఆడియన్స్ బాలీవుడ్ బాయ్ కాట్ స్లోగన్ తో సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. దేశవ్యాప్తంగా అదే కొనసాగుతుంది. ఈ దశలో విడుదలవుతున్న బాలీవుడ్ సినిమాలు వరుసగా అపజయాన్ని చవిచూస్తున్నాయి. ఎటువంటి కథలతో సినిమా తీస్తే బాలీవుడ్ జనాలు థియేటర్ లకు వస్తారో అటువంటి వాటిని కచ్చితంగా తీయాలని బాలీవుడ్ దర్శక నిర్మాతలు డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఊహించని విధంగా భారీ విజయాన్ని సాధించింది. రెండు రోజులలో 200 కోట్లను వసూలు చేసింది. ఈ సినిమా విజయంతో మళ్లీ బాలీవుడ్ గాడిలో పడినట్లు అయింది. బాలీవుడ్ పూర్వ వైభవానికి నాంది పలికింది. ఈ సినిమా విజయవంతం బాలీవుడ్ ఊపిరి పీల్చుకుంది. అయితే అసలు కథ ఇక ముందుంది. నేషనల్ స్టార్ ప్రభాస్ నటించిన ఆది పురుష్, సలార్ మూవీలు బాక్సాఫీస్ పై దండేత్తడానికి రెడీగా ఉన్నాయి. మళ్లీ బాహుబల సీన్ రిపీట్ అయితే బాలీవుడ్ కి చుక్కలు కనిపించడం ఖాయం అనిపిస్తుంది. పఠాన్ తర్వాత బాలీవుడ్ సినిమాలు వరుసగా విజయాలు సాధిస్తే పర్లేదు తర్వాత వచ్చే సినిమాలు చతికల పడితే మాత్రం మళ్లీ బాలీవుడ్ కి కష్టాలు చుట్టుముట్టినట్లే.
previous post
next post