కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుని బ్రహ్మోత్సవం… బ్రహ్మాండనాయకునికి దివ్యోత్సవం ఆ బ్రహ్మోత్సవాన్ని చూడాలని ఆ అద్భుత దృశ్యాన్ని కనులారా కాంచాలని తపించని హృదయం ఉండదు. ఏటా శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు నాలుగు మాడవీధుల్లో వివిధ వాహనాల్లో ఊరేగే శ్రీవారిని దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం అని భక్తులు నమ్మకం. తొమ్మిది రోజులు పాటు జరిగే ఈ వార్షిక బ్రహ్మోత్సవాల్లో స్వామివారు ఒక్కరోజు ఒక్కో వాహనంపై ఊరేగుతారు.. అలాంటిది స్వామివారికి ముఖ్యమైన ఏడు వాహనాలను ఒకేరోజు అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చే మరో ప్రత్యేక రోజు రధసప్తమి రానుంది.. జనవరి 28వ తేదీ వచ్చే రథసప్తమి రోజు మలయప్ప స్వామి వారు సప్త వాహనాలను ఆరోజు అధిరోహించి పూజలు అందుకొనున్నారు తెల్లవారుజామున 5 గంటల నుంచి సాగే ఈ అపురూప ఘట్టంలో ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్య భగవానుడికి ప్రతీకైనా సూర్యప్రభ వాహనాన్ని కలియుగ దైవం అధిరోహించి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఆరోగ్యం.., ఐశ్వర్యం కలిగించే సూర్యప్రభ వాహనదారి శ్రీనివాసుడు సూర్యకిరణ ప్రసరణ అనంతరం ఐదు తలల వాసుకి తో కూడినటువంటి చిన్న శేషవాహనాన్ని.., తరువాత తన ప్రధమ భక్తుడు అత్యంత ప్రీతి కారకుడు అయినటువంటి గరుడ వాహనాన్ని ఎక్కి ఊరేగుతారు గరుడవాహనం లోని స్వామివారి దర్శనం ఎంతో మంగళప్రధం గా భక్తులు భావిస్తారు ఆ తరువాత బుద్ధి బలాన్ని ప్రసాదించే హనుమంత వాహనంలో విహరించి శ్రీదేవి భూదేవి సమేత కోరిన కోర్కెలు తీర్చే కల్పవృక్ష వాహనంలో భక్తకోటికి దర్శనం ఇస్తారు తదనంతరం సర్వభూపాల వాహనంపై ఊరేగి రాత్రి సమయంలో చంద్రోదయం వేళ చంద్రప్రభ వాహనంతో ఉత్సవ ముగింపు జరుగుతుంది మధ్యలో చక్రస్నాన మహోత్సవం భక్తులకు అద్వితీయ అనుభూతి ని పంచుతుంది. విశేష తిరు ఆభరణాలతో, పుష్పాలంకరణతో స్వామి దర్శనం నభూతొ నభవిష్యతిగా భక్తులు వర్ణిస్తారు ఒకేరోజు సప్త వాహనాలపై స్వామి దర్శనం మరపురాని దివ్యానుభూతి.
previous post