తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కోసం ఎదురు చూసే భక్తుల కోసం టీటీడీ విడుదల చేసిన 300 రూపాయల దర్శనం టిక్కెట్లు పదే పది నిమిషాలలో అయిపోయాయి.. తిరుమలలో జనవరి 2వ తేదీ నుంచ శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం ప్రారంభం కానున్న నేపద్యంలో జనవరి 2వ తేదీ నుంచి 11 వ తేదీ వరకు రూ 300 ప్రత్యేక ప్రవేశ దర్శనం ఆన్ లైన్ టికెట్లను రోజుకు 20వేల టికెట్లు చొప్పున పది రోజులకు సంబందించిన టికెట్లను ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి తెచ్చిన పది నిమిషాలోనే మొత్తం అన్ని టిక్కెట్ల అమ్మకాలు పూర్తయిపోయాయి టికెట్లు కలిగిన వారిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని ఇప్పటికే టీటీడీ స్పష్టం చేసింది. జనవరి 1వ తేదీ రద్దీ ఉంటుందనే అంచనాలతో టీటీడీ ప్రత్యేక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటికే బ్రేక్ దర్శనాల సమయాల్లో మార్పులు చేసిన టీటీడీ..జనవరి 1 కొత్త సంవత్సరం రద్దీ వేళ మరి కొన్ని నిర్ణయాలు అమలు చేయనుంది. వీఐపీలు నేరుగా వస్తే వారికి ప్రోటోకాల్ దర్శనం కేటాయించనుంది. సిఫార్సు లేఖలు తీసుకోకూడదని డిసైడ్ అయింది. జనవరి 2వ తేదీ నుండి 12వ తేదీ వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం గత సంప్రదాయాల మేరకు కొనసాగించనుంది. అయితే, గతం కంటే ఎక్కువ సంఖ్యలో భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి సుప్రభాత సేవ ఈ మాసం మొత్తం రద్దు చేసారు. ఆ స్థానంలో తిరుప్పావై అమలు చేస్తున్నారు. సంక్రాంతి పర్వదినం పూర్తయ్యే వరకూ వీఐపీ బ్రేక్ దర్శనాల స్థానంలో సాధారణ భక్తులక ప్రాధన్యత ఇవ్వాలని నిర్ణయించారు. ఈ వారాంతం నుంచి సంక్రాంతి వరకు తిరుమల కొండ పైన భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని అంచనా ఇదిలా ఉండగా వైకుంఠ ద్వార దర్శనం కోసం శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ రోజుకు 2000 టికెట్లు చొప్పున ఆన్లైన్లో విడుదల చేసింది.భక్తులు శ్రీవాణి ట్రస్టుకు పదివేలు విరాళం ఇవ్వడంతోపాటు 300 రూపాయల దర్శన టికెట్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఈ టికెట్లను బుక్ చేసుకున్న భక్తులకు మహా లఘు దర్శనం జయ విజయుల వద్ద నుంచి మాత్రమే ఉంటుంద టీటీడీ తెలిపింది.