ఇదేదో ఫోటోషాప్ లో చేసిన జిమ్మిక్ కానే కాదు నిజంగా నిజమైన ఫోటో.. తింటున్నది నిజమైన అరటిపండే.. హండ్రెడ్ పర్సెంట్ గ్రాఫిక్ కానే కాదు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అరటి. కేవలం పండే కాదు చెట్టు కూడా బాహుబలి సైజే.. ఈ అరటి చెట్టు వరల్డ్ లార్జెస్ట్ పదిహేను మీటర్లు ఎత్తు అంటే దాదాపు 49 అడుగులు ఆకులు ఐదు మీటర్ల నుంచి ఇరవైమీటర్ల వరకు పెరుగుతాయి ఆకు వెడల్పు కచ్చితంగా ఒక మీటర్ పై మాటే ఆకులతో కలిపి చెట్టు హైట్ ను లెక్కేస్తే దాదాపు అరవై ఆరు అడుగులు పైనే నట. ఇండోనేషియాలోని అర్ఫాక్ మౌంటెన్ రీజెన్సీలోని పాపువా ఫారెస్ట్ న్యూగెనియా లో ఈ అరటి చెట్లున్నాయి.. నిజానికి మనం అరటి చెట్టు అని వాడేస్తాం కానీ అరటి అనేది మొక్క. అంటే బనానా ప్లాంట్ అన్నమాట ఇది హెర్భసియాస్ పువ్వు కి సంభందించిన జాతి. ఇక్కడున్న అరటి చెట్టు కాండం చుట్టుకొలత ఒకటి నుండి రెండు మీటర్లు సముద్రమట్టానికి వెయ్యి నుండి రెండు వేల మీటర్ల ఎత్తులో ఉంటాయి. అరటిగెలకు సుమారు మూడువందల వరకు పండ్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క పండు ఏడు అంగుళాల నుంచి 12 అంగుళాల వరకు పెరుగుతాయి. తీయగా కొద్దిగా పుల్లగా రుచి కలిగే ఈ పండు గుజ్జు(పల్ప్) పసుపు పచ్చగా.. విత్తనాలు నలుపు మరియు కాఫీ రంగులో ఉండగా విత్తనాలు సైజు మాత్రం నాలుగు నుంచి పది మీల్లీ మీటర్లగా ఉంటాయి 1989లో జెఫ్ డేనియల్స్ అనే పరిశోధకుడు ఈ భారీ అరటిని కనుగొన్నాడు పర్వత చిత్తడి నేల అంచుల్లో తేమ కూడిన ప్రాంతాల్లో పెరిగే ఈ అరటి విత్తనాలు కొన్ని ఇండియన్ వెబ్సైట్లో కూడా లభ్యమవుతున్నాయి.. వావ్… అనిపించే ఈ అరటి ని పెంచుకోవాలని ఆసక్తి ఉంటే కొన్ని ప్రాంతాల వారు ట్రై చేయొచ్చు..