అల్లు- నందమూరి హీరోల మధ్య పెన వేసుకుంటున్న బంధం పై మెగా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిన్నటి వరకు జై చిరంజీవ అనే స్లొగన్స్ చేసిన అల్లు హీరోలు నేడు జై బాలయ్య అంటూ స్లొగన్స్ చేయడంపై మండిపడుతున్నారు. ఊర్వశివో రాక్షసివో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు శిరీష్ బాలయ్యను అదే పనిగా పొగుడుతూ మాట్లాడటం, జై బాలయ్య అంటూ నినాదాలు చేయడం, కావాలని బాలయ్య చేతిని తన భుజంపై వేసుకోవడం వంటి చర్యలను చూసి మెగా అభిమానులు మండిపడుతున్నారు. మెగా అభిమానులను రెచ్చగొట్టే విధంగా నాడు అఖండ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా పాల్గొని బాలకృష్ణ పొగడటం, నేడు అల్లు శిరీష్ కూడా అదే పనిగా బాలకృష్ణను పొగడటం మెగాస్టార్ చిరంజీవిని అవమానించే విధంగా ఉన్నాయంటూ మెగా అభిమానులు అంటున్నారు. చిరంజీవి అనే వ్యక్తి లేకపోతే అటు అల్లు అరవింద్ గాని ఇటు అల్లు అర్జున్, అల్లు శిరీష్ కు అంత పేరు వచ్చి ఉండేదా అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అయితే అటు అల్లు అభిమానులు మాత్రం చిరంజీవి అల్లు రామలింగయ్య కుమార్తెను పెళ్లి చేసుకోక ముందు నుంచే సీనియర్ ఎన్టీఆర్, అల్లు రామలింగయ్య ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని అంటున్నారు. చిరంజీవి ఇండస్ట్రీ కి వచ్చిన ప్రారంభ దశలో అతనిని సీనియర్ ఎన్టీఆర్ తొక్కేయకుండా అల్లు రామలింగయ్య చేసిన ప్రయత్నాలు మెగా అభిమానులకు తెలియవని, చిరంజీవి ఇండస్ట్రీలో మంచి హీరోగా నిలదొక్కుకునే విధంగా తెర వెనుక అల్లు రామలింగయ్య, అరవింద్ చేసిన కృషి ఇండస్ట్రీ మొత్తం తెలుసని అల్లు అభిమానులు పేర్కొంటున్నారు. అల్లు -మెగా హీరోల మధ్య వృత్తిపరమైన పోటీ ఉంటుందని ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అల్లు అరవింద్ చెప్పారు. తమ మధ్య పోటీ ఉన్నప్పటికీ కుటుంబ సభ్యులుగా అందరూ కలిసి ఉంటామని పేర్కొనడం విశేషం. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న సఖ్యత పై జరుగుతున్న ప్రచారంపై మాత్రం మెగా హీరోలు ఎవరు కూడా నోరు మెదపడం లేదు.
previous post