Vaisaakhi – Pakka Infotainment

వస్తున్నాం.. హిట్ కొడుతున్నాం..

నందమూరి బాలకృష్ణ-గోపిచంద్ మలినేని కాంబినేషన్లో రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న మూవీ పై భారీ అంచనాలున్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు గోపీచంద్ మలినేని ఖాతాలో మరో హిట్ పడటం ఖాయమనేది స్పష్టమవుతుంది. అలాగే అటు అఖండ, ఇటు ఆన్ స్టాపబుల్ సక్సెస్ తో మాంచి స్వింగ్ లో ఉన్న బాలకృష్ణ కు ఈ మూవీ అఖండను మించి మంచి హిట్ ఇస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూవీకి సంబంధించి మేకర్స్ టైటిల్ అనౌన్స్ చేశారు. కర్నూలు కొండా రెడ్డి బురుజుపై అభిమానుల సమక్షంలో టైటిల్ పోస్టర్‌ను లాంచ్ చేశారు. బాలకృష్ణ సెంటిమెంట్ కలిసొచ్చేలా ఈ మూవీకి ‘వీరసింహారెడ్డి’ టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపిచంద్ మలినేని మాట్లాడుతూ వీరసింహారెడ్డి లో నందమూరి బాలకృష్ణ విశ్వరూపం చూస్తారని చెప్పారు. బాలకృష్ణ డైలాగ్స్, ఫైట్స్, డాన్స్ కు థియేటర్లు దద్దరిల్లి పోతాయని అన్నారు. ఈ మూవీతో భారీ కొట్టభోతున్నామని స్పష్టం చేశారు. మూవీని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫామ్ చేశారు. సంక్రాంతి బాలకృష్ణకు బాగా కలిసి వచ్చే సీజన్. గతంలో చూసుకుంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాసిన బాలకృష్ణ సినిమాలు అన్ని సంక్రాంతి సీజన్ లోనే రిలీజ్ అయ్యాయని అన్నారు. సంక్రాంతి వస్తున్నాం.. భారీ హిట్ కొడుతున్నాం అని దర్శకుడు గోపిచంద్ మలినేని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పారు. షూటింగ్ ఇంకా ఇరవై రోజులు ఉందని, ఇప్పుడు రిలీజ్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అంత స్టఫ్ ఈ సినిమాలో ఉందని నమ్మకంగా చెప్పుకొచ్చారు గోపి చంద్. బాలకృష్ణ అభిమానిగా తీసిన సినిమా వీరసింహారెడ్డి సినిమా మాత్రం ఫ్యాన్స్ అందరూ పండగ చేసుకునేలా ఉంటుందని, సమరసింహా రెడ్డి ఎలాంటి వైబ్రేషన్ ఇచ్చిందో అలాంటి వైబ్రేషన్ వీరసింహా రెడ్డి ఇస్తుందన్నారు. అభిమానులు ఊహించినదాని కంటే రెండింతలు ఎక్కువ ఉంటుందన్నారు. సంక్రాంతికి మన వీరసింహారెడ్డి విజ్రుభించబోతున్నాడని,బాలకృష్ణ ను డైరెక్ట చేయడం తన అదృష్టమని వెల్లడించారు. మూవీ రిలీజ్ తర్వాత థియేటర్లో మోత మాములుగా ఉండదని, ఫ్యాన్స్ లానే తాను కూడా థియేటర్ లో చూడాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఇంతకుముందు గోపీచంద్ మలినేని, రవితేజ కాంబో లో వచ్చిన క్రాక్ మూవీ ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే, అలాగే బాలకృష్ణ గత చిత్రం అఖండ భారీ విజయం సాధించి రికార్డులను తిరగరాసింది. భారీ సక్సెస్ లు సాధించిన బాలకృష్ణ- గోపీచంద్ కాంబోలో వస్తున్న వీరసింహారెడ్డి మూవీ పై మాత్రం భారీ అంచనాలు నెలకొన్నాయి. అభిమానులు కూడా ఆసక్తిగా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More