భారతీయ సినీ చరిత్రలో తెలుగు దర్శకులకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రయోగాలకు, కొత్త ఒరవడికి, సృజనాత్మకతకు పెట్టింది పేరైనా టాలీవుడ్ ఇండస్ట్రీ నాటి నుంచి నేటి వరకు ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందుతూ వస్తుంది. మరీ ముఖ్యంగా జానపద చారిత్రక పౌరాణిక చిత్రాలను తీయడంలో తెలుగు దర్శకలను ఢీకొట్టే వారెవరు లేరంటే అతిశయోక్తి కాదు. వివిధ భాషలలో అటువంటి చిత్రాలు రూపొందించినప్పటికీ తెలుగులోనే ఎక్కువ గుర్తింపును తెచ్చుకున్నాయి. తెలుగు పరిశ్రమ ప్రారంభంలో చాలావరకు పౌరాణిక చిత్రాలు, జానపద చిత్రాలు వచ్చేవి. తర్వాత చారిత్రక చిత్రాలు కూడా ప్రారంభమయ్యాయి. ఆయా చిత్రాలు తీయడంలో తెలుగు దర్శకుల రూటే సపరేట్ గా ఉండేది.ఒక్కో దర్శకుడు ఒక్కో తరహా సినిమా చేయగలరనే ప్రత్యేకమైన గుర్తింపు కూడా వచ్చింది. అప్పట్లో పాతాళ భైరవి, మల్లీశ్వరి, కీలు గుర్రం, లైలా మజ్ను, విప్రనారాయణ, లవకుశ వంటి ఎన్నో చిత్రాలు విజయవంతంగా ప్రదర్శించబడ్డాయి. అప్పటి దర్శకుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని నేటి దర్శకులు కూడా అదే ఒరవడిని సృష్టిస్తున్నారు. అందుకు ఉదాహరణగా బాహుబలి, బింబిసారా, కార్తికేయ చిత్రాలను చెప్పుకోవచ్చు. అదే సమయంలో ఇతర భాషలలో తీసిన ఇటువంటి చిత్రాలు ఘోరంగా ఫెయిల్ అవుతున్నాయి. దీనికి మొన్న రిలీజ్ అయిన ఆది పురుష్ టీజర్ చూసి సినిమా హిందీ దర్శకుల స్టాండర్డ్ ఏంటో చెప్పుకోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఆ సినిమా పై తీవ్ర విమర్శలు వెలువెత్తుతున్నాయి. ఇక తమిళ్ పొన్నియన్ సెల్వన్ సినిమా పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆ మధ్య కన్నడలో వచ్చిన కురుక్షేత్ర చిత్రం కూడా ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం భారతీయ సినీ ఇండస్ట్రీలో చిత్రాల హవా నడుస్తుంది. టాలీవుడ్ హీరోలకు, టాలీవుడ్ దర్శకులకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి కొన్ని ఇండస్ట్రీలు తట్టుకోలేకపోతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్ పై బురద జల్లే కార్యక్రమాలను కూడా చేపట్టాయి. ఏదేమైనప్పటికీ భారతీయ సినీ ఇండస్ట్రీని టాలీవుడ్ మరికొన్నాళ్లు శాసించడం ఖాయం అన్నది స్పష్టమవుతుంది.
previous post