ఎనిమిది దశాబ్దాల సినిమా సంగతి ఎలా వున్నా ఒక దశాబ్ధం నుండి సినిమా తన రూపురేఖలను సక్సెస్ లెక్కలను పూర్తిగా మార్చేసుకుంది.. అర్ధ శతదినోత్సవాలు, శతదినోత్సవాలు, సిల్వర్ జూబ్లీ , గోల్డెన్ జూబ్లీలు ఇవే ఒకప్పటి కొలమానాలు.. కొన్ని సినిమాలు స్థాయిని బట్టి సంవత్సరాలు ఆడేవి.. తరువాత కలెక్షన్స్ లెక్కలొచ్చాయి.. టూ హండ్రెడ్ సెంటర్స్ హండ్రెడ్ డేస్… వంద కేంద్రాలు రెండువందల రోజులు.. 365 డేస్ ఇన్ 75సెంటర్స్ ఇలా పోస్టర్స్ మారుతూ వచ్చేవి.. దాదాపుగా ఫేక్ పోస్టర్స్ వుండేవి కాదు.. ఎందుకంటే దానిమీదే సినిమా ఆడే కేంద్రాలను కూడా ప్రింట్ చేసేవారు.. అభిమానులకి, దురభిమానులకు క్లారిటీ వుండేది.. ఇప్పుడు 100 రోజులు పోస్టర్ చూద్దాం అన్నా కూడా కనిపించడం సరికదా.. కనీసం 50 రోజులు ఆడిన సినిమాలు కూడా కనుచూపు మేరలో కనిపించడం లేదు. అంతెందుకు ఆర్ఆర్ఆర్ లాంటి పెద్ద సినిమాలు కూడా 100 రోజులు ఆడాలంటే.. డక్కా ముక్కీలు తినాల్సిన పరిస్థితి ఇప్పుడంతా ట్రెండ్ మారిపోయింది. మహా అయితే వారం.. తప్పితే రెండో వారం అనేట్టుగానే ఉంది పరిస్థితి. అయితే ఈ రెండు వారాల్లో రాబట్టిన కలెక్షన్లు బట్టే సినిమా హిట్టా ఫట్టా అని లెక్కలు కడుతున్నారు. ఇవి కూడా కరెక్ట్ అని చెప్పలేం.. ట్రాన్స్పరెన్సీ డౌటే.. పోటీగా వచ్చిన సినిమా 100 కోట్లు కలెక్షన్స్ అని పోస్టర్ వదిలితే.. వీళ్లు 150 కోట్లు అంటున్నాడు. అప్పట్లో ‘సరిలేరు నీకెవ్వరు’, ‘అలవైకుంఠపురం’ రిలీజ్ టైంలో ఈ పోస్టర్ వార్ ఏం రేంజ్లో నడిచిందో చూశాం. వాళ్లు రూ. 50 కోట్లు అంటే వీళ్లు 100 అని.. వీళ్లు వంద అంటే.. వాళ్లు 150 అని కోట్లను పెంచుకుంటూ ఫేక్ పోస్టర్లతో హల్ చల్ చేశారు. ఆ సంక్రాంతి సీజన్ ఒకడు మొగుడు అంటే.. ఇంకొకడు రంకుమొగుడు అంటూ రచ్చ రచ్చ చేసుకున్నారు. దీంతో ఈ కలెక్షన్లు కూడా ఫేక్ అని తేలిపోయింది.ఇప్పుడింకా దరిద్రం ఏంటంటే.. అట్టర్ ఫ్లాప్ సినిమాలకు కూడా సక్సెస్ మీట్లు పెట్టి డబ్బా కొడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు సినిమా హిట్ అని ఎలా లెక్కకడుతున్నారు? కలెక్షన్ల బట్టా? ప్రేక్షకులు థియేటర్స్కి రావడం లేదని సినిమాలు చూడటం లేదని నిర్మాతలు గోల చేస్తున్నారు అయితే.. సినిమా ఆడకపోవడానికి చాలా కారణాలు కూడా వారే క్రియేట్ చేసుకుంటున్నారన్న విషయాన్ని మర్చిపోతున్నారు. అరచేతిలో ప్రపంచవినోదమే అందుబాటులోకి వచ్చినపుడు ముందస్తు ఓటీటీ రిలీజ్ కు ఎనౌన్స్ చేస్తున్నప్పుడు ఆ సినిమా థియేటర్ లో కచ్చితంగా చూడాల్సిందే అని అనిపిస్తే తప్ప రాని సిట్యుయేషన్స్ ఏర్పడ్డాయి. టిక్కెట్ రేట్లు కావచ్చు థియేటర్స్లో ఫుడ్ ఐటమ్స్ కావచ్చు.. కంటెంట్ కావచ్చు.. ఇంకేమైనా కావచ్చు. అవసరాన్ని మించి ఖర్చు పెట్టడం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. డబ్బుల లెక్కలు వేసుకునే సగటు ప్రేక్షకుడు ఓటీటీ లో చూసేయోచ్చని ఫిక్స్ అయిపోతున్నాడు. కలెక్షన్లు మాత్రమే సక్సెస్ కి కొలమానం.. డబ్బుల్ని బట్టే హిట్, ఫట్ అన్నదానికి కూడా పుల్ స్టాప్ పెట్టేసి మేకర్స్ మరో కొత్త పల్లవి అందుకున్నారు.. ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్స్ లో తక్కువ టైం లో ఏ చిత్రాలు ఎక్కువ వ్యూస్ అందుకున్నాయో అవి హిట్ అని ప్రచారం చేసుకోవడం మొదలెట్టేసారు.. కనీసం చూడాటానికి అర్హత లేని చిత్రాలు కూడా ఓటీటీ ల్లో గణనీయమైన వ్యూసే దక్కించుకున్నాయి… వాటినే హిట్ కి సరైన లెక్క అని పెట్టుకుంటే దియేటర్స్ ని షేక్ చేసిన ఉప్పెన, జాతిరత్నాలు ను ఈ ఫ్లాట్ ఫార్మ్స్ లో చూసిన ప్రేక్షకుడు ఇవెలా హిట్ అయ్యాయో అని క్వశ్చన్ మార్క్ తో పెదవి విరిచాడు.. ఇప్పుడు మార్కెటింగ్ టీమ్ మరో హిట్ ఫార్ములా ని తెరమీదకు తీసుకొచ్చారు.. ఐఎండీబి, బుక్ మైషో, పేటీఎం, గూగుల్ రేటింగ్ లా ఆధారం గా హిట్ పోస్టర్స్ జనాలపైకి వదులుతున్నారు.. మనసులో కుమిలిపోతూ… హిట్ అని చెప్పుకోవడం ఇలాంటిదే.. ఇలాంటి రేటింగ్ లు, వ్యూస్ మేనేజ్ చేసేవే అన్న విషయం మన ఆడియన్స్ కి తెలియని విషయం అని ప్రొడక్షన్స్ హౌస్ లు అనుకోడం నిజానికి ఆత్మవంచనే.. ఇవన్నీ సరే ఇప్పుడు దేన్నీ ప్రామాణికం గా తీసుకోవాలి.. నిజానికి హిట్ ఫట్… మార్కెటింగ్ పర్సన్ ల ఇష్టాఇష్టాలపై ఊపిరి పోసుకోకూడడు… కంటెంట్ ని బట్టి ఆడియన్స్ మైండ్సెట్ బట్టి వాటికవే డిసైడ్ అయిపోవాలి.. అంతే తప్పా.. విజయానికి కొత్త భాష్యం మనం మళ్ళీ కొత్తగా చెప్పకూడదు…