“నా డెత్ సర్టిఫికెట్ పోయింది దొరికితే నా అడ్రస్ కి పంపించండి “.. ఇది చదివి ఏంటిది అని తలగోక్కుంటూ కాసేపలా ఆలోచిస్తున్నారా ? ఇది చదివిన వాళ్ళందరూ కూడా కాస్త విచిత్రంగా ఉన్న ఈ పోస్ట్ ను చూసి నవ్వుకుంటారు. ఐపీఎస్ అధికారి రుపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఓ మ్యాటర్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.ఆ ట్వీట్ కు ‘దిస్ హ్యాపెన్స్ ఓన్లీ ఇన్ ఇండియా’ అంటూ క్యాప్షన్ ను ఆయన జతచేశారు. ఓ వ్యక్తి విచిత్రంగా ఓ పేపర్ లో ఇచ్చిన ఈ ప్రకటన ఎంతోమందిని నవ్వుకునేలా చేసింది. ఇంతకీ ఏమిటా పోస్టు అంటే.. ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నట్టు ఓ పత్రికలో ప్రకటన ఇచ్చాడు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 7వ తేదీన అస్సాంలోని లందింగ్ బజార్ వద్ద ఘటన జరిగినట్లు పేర్కొన్నాడు. ఈ ప్రకటనలో రిజిస్ట్రేషన్ నెంబర్, వరుస సంఖ్య కూడా ఉన్నాయి. ప్రస్తుతం సోషల్ మీడియా ఈ పోస్ట్ బాగా వైరల్ అయింది. కాస్త విచిత్రంగా ఉన్న ఈ పోస్టు పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ తిరిగి పోస్టు లు పెడుతున్నారు. ఈ పోస్ట్ ను చూసిన వినియోగదారుల్లో ఒకరు ఆ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ స్వర్గం నుంచి ఇవ్వాలని అడుగుతున్నారు అని కామెంట్ చేశారు. మరో యూజర్ ఎవరో ఓ వ్యక్తి తన డెత్ సర్టిఫికెట్ పోగొట్టుకున్నాడు. దొరికిన వాళ్లు అతనికి ఇచ్చేయండి అంటూ కామెంట్ చేశారు. ఇలా పలువురు యూజర్లు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. మొత్తానికి ఈ పోస్ట్ ఇప్పుడు బాగా వైరల్ అయింది.
previous post
next post