తెలుగు సినిమా రంగంలో డేరింగ్ అండ్ డాష్ అంటే ఆయనే .. సాహసం అంటే ఎప్పుడు ముందుండేవారు జీవితం ఎప్పుడూ థ్రిల్ గా ఉండాలని కోరుకునేవారు లైఫ్ మెకానికల్ గా డల్ గా జరగడం అంటే అస్సలు ఇష్టపడని ఆయన థ్రిల్ ని ఎప్పుడు స్వాగతించేవారు. సాహసకృత్యాలను ఎంత ఇష్టపడతారో అవి ఎల్లవేళలా సక్సెస్ అవుతాయని గ్యారెంటీ కూడా లేదని అంతే నమ్మే ఆ హీరో సూపర్ స్టార్ కృష్ణ ఆయన జీవితంలో మరిచిపోవాలని సాహాసం.. ఒకటి మోసగాళ్లకు మోసగాడు షూటింగ్లో జరిగింది నిజానికి ఆ చిత్ర నిర్మాణమే గొప్ప సాహసం అలాంటి సినిమా షూటింగ్లో పాల్గొనడం ఇంకా పెద్ద సాహసం. ఇంకా అందులో గుర్తు పెట్టుకునే మరో అడ్వెంచర్ ఆ సినిమా షూటింగ్ లో జరగడం.. నిజానికి ఈ సినిమా కొన్ని ఇంగ్లీష్ సినిమాల ప్రేరణ తో తీసిన కౌబాయ్ చిత్రం. ఇందులో హార్స్ రేస్ కి ఉన్న ప్రాధాన్యత దృష్ట్యా మద్రాస్ (ఇప్పటి చెన్నై)లో కొన్ని రోజులు గుర్రపు స్వారీలో ప్రత్యేక కోచింగ్ తీసుకున్నారు సూపర్ స్టార్ కృష్ణ. షూటింగ్ కోసం రాజస్థాన్లోని బికినీర్ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.. పూర్తి స్థాయిలో శిక్షణ పొందిన గుర్రాలను కూడా ఏర్పాటు చేసుకున్నారు. షూటింగ్ ప్రారంభమైన తొలి రోజే గుర్రాలతో సీన్ దర్శకులు కే ఎస్ ఆర్ దాస్ కెమెరా యాక్షన్ అనగానే కృష్ణ గుర్రం ఎక్కి అదిరించేసరికి అది బ్రేక్ లేని బండిలా ఒక్కసారి ఫోర్త్ గేరేసేసింది అంత స్పీడ్ లో దౌడు తీస్తూ సడన్ గా గట్టిగా ఓ కుదుపు కుదిపేసింది ఇంకేముంది క్షణాల్లో హీరో కృష్ణ ఎగిరి కింద పడటం.. ఇసుకంతా రేగి ఏం జరిగిందో తెలియని అయోమయం.. యూనిట్ మొత్తం ఒక్కసారిగా షాక్. లక్కీగా అది ఇసుక ప్రాంతం కాబట్టి ఆయనకు ఏమి కాలేదు అంతా ఊపిరి పీల్చుకున్నారు. తరువాత కొన్ని జాగ్రత్తలతో షూటింగ్ కొనసాగించారు.. ఇక్కడ ఏతావతా చెప్పొచ్చేటంటే మద్రాసులో అన్ని రోజులు గుర్రపు స్వారి కోసం ఆయన తీసుకున్న శిక్షణ రాజస్థాన్ గుర్రాలకు మాత్రం వర్కౌట్ కాలేదు అంతే.. ఈ విషయాన్ని సూపర్ స్టార్ తన జీవితంలో జరిగిన ఒక సాహసం గా అప్పట్లో ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అత్యంత సాహసోపేతంగా నిర్మించిన ఈ తొలి కౌబాయ్ చిత్రం 1971 ఆగస్టు 27 విడుదలై బాక్సాఫీస్ కొల్లగొట్టి కృష్ణ ని కౌబాయ్ హీరోగా మార్చింది.
previous post
next post