భారత సైన్యం దశాబ్ద కాలంగా వినియోగిస్తున్న పినాక రాకెట్ లాంచర్ అభివృద్ధి దిశగా కీలక ముందడుగు పడింది. భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డి.ఆర్.డి.ఓ రాజస్తాన్‌లోని పోఖ్రాన్ ఫైరింగ్ రేంజ్‌లో పినాకా రాకెట్ ను విజయవంతంగా పరీక్షించింది. ఇది శత్రు భూభాగంలోకి 75 కిలోమీటర్ల వరకు దూసుకువెళ్లి ఖచ్చితత్వంతో దాడి చేస్తుంది. పినాక-ఈఆర్ అనేది గత దశాబ్ద కాలంగా భారత సైన్యంతో సేవలో ఉన్న పినాకా మునుపటి వెర్షన్‌కి అప్‌గ్రేడ్ చేసిన వెర్షన్ అని డీఆర్డీవో తెలిపింది. హెచ్.ఇ.ఎం.ఆర్.ఎల్. సంస్ధ తో కలిసి ఈ వ్యవస్థను అభివృద్ధి చేశారు. డీఆర్డీఓ నుంచి ఈ సాంకేతికతను పొందిన ఓ ప్రైవేటు కంపెనీ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసింది. కొత్తగా ఉద్భవిస్తున్న అవసరాలకు అనుగుణంగా ఆధునిక పరిజ్ఞానంతో దీనిని రూపొందించినట్లు డీఆర్డీఓ తెలిపింది. భాగస్వామ్య ప్రైవేటు కంపెనీ సాంకేతికతను అవగతం చేసుకోవడంలో ప్రాథమికంగా విజయవంతం కావడంతో పినాక-ఈఆర్ రాకెట్ వ్యవస్థ తయారీకి ఆ కంపెనీని సిద్ధం చేసినట్లు వెల్లడించింది. ఇక, గత కొన్నేళ్లుగా పోఖ్రాన్లో చేపట్టిన పినాక రాకెట్ లాంచర్ విస్తరణ శ్రేణి వ్యవస్థ వివిధ దశ ప్రయోగాలు విజయవంతమైనట్లు రక్షణశాఖ కూడా ప్రకటించింది. ప్రయోగాల్లో భాగంగా వివిధ శ్రేణులు, వార్‌హెడ్‌ల సామర్థ్యాలతో 24 పినాకా రాకెట్లను ప్రయోగించినట్లు,వివిధ రకాల సామర్ధ్యం ఉన్న వార్‌హెడ్స్ తో పినాకా రాకెట్లను పరీక్షించామని, అన్ని ట్రయల్స్‌లోనూ సంతృప్తికరంగా ఫలితాలు వచ్చినట్లు రక్షణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కాగా,పినాకా ఎంకే-ఐ రాకెట్ వ్యవస్థ సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నలక్ష్యాలను నాశనం చేయగలదని, అలాగే పినాకా-2 వేరియంట్ 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్‌ను చిత్తు చేస్తుందని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో ) అధికారి తెలిపారు. అయితే వివిధ రేంజ్‌ల్లో ఉన్న టార్గెట్లపై 24 రాకెట్లను పరీక్షించినట్లు మాత్రమే తెలిపారు. ప్రస్తుతం పరీక్షించిన రాకెట్ 75 కిలోమీటర్ల వరకు దూసుకువెళ్లి ఖచ్చితత్వంతో దాడి చేస్తుందన్నారు.
previous post