సగటున పురుషుల కన్నా మహిళలకే ఎక్కువ మంది సెక్స్ పార్ట్నర్లు ఉన్నారు. అయితే.. భార్యలు, సహజీవనం చేస్తున్న మహిళలు కాకుండా.. ఇతరులతో శృంగారంలో పాల్గొన్న పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంది. పురుషులు 4శాతంగా ఉండగా.. ఇదే విషయంలో మహిళల శాతం 0.5గా ఉంది. ఈ వివరాలను దేశంలోని 11 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిర్వహించిన నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే(ఎన్ఎప్హెచ్ఎస్) వెల్లడించింది. 1.1లక్షల మంది మహిళలు, 1 లక్షమంది పురుషులపై ఈ సర్వే జరిగింది. అనేక రాష్ట్రాల్లో.. పురుషుల కన్నా మహిళలకే సగటున సెక్స్ పార్ట్నర్లు ఎక్కువగా ఉన్నారని సర్వే తేల్చిచెప్పింది రాజస్థాన్, హరియాణా, ఛండీగఢ్, జమ్ముకశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, అసోం, కేరళ, లక్ష్యద్వీప్, పుదుచ్చేరి, తమిళనాడులో పురుషుల కన్నా మహిళలకే సెక్స్ పార్ట్నర్లు ఎక్కువగా ఉండగా ఈ జాబితాలో రాజస్థాన్ టాప్లో ఉంది. అక్కడ సెక్స్ పార్ట్నర్ల ఎక్కువగా ఉన్న మహిళల సగటు 3.1గా ఉంది. అదే రాజస్థాన్ పురుషుల్లో అది 1.8గా ఉంది. కానీ ఇతరులతో శృంగారం విషయంలో పురుషులే టాప్లో ఉన్నారు. భార్యలు, సహజీనం చేస్తున్న వారు కాకుండా.. ఇతరులతో శృంగారంలో పాల్గొంటున్న పురుషుల సగటు మహిళల కన్నా చాలా ఎక్కువగా ఉంది. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే-5.. 2019-21 మధ్యలో జరిగింది. దేశంలోని 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 707 జిల్లాల్లో సర్వే చేపట్టారు.