మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం సుకన్యపల్లి గ్రామ శివారులోని దట్టమైన అడవిలో పాత చిత్తారయ్య గుహల్లో బయటపడిన మధ్యయుగం కాలం నాటి కొన్ని ఆధారాలు పరిశోధకులను నివ్వెర పోయేలా చేస్తున్నాయి. మధ్య రాతియుగంలో పెద్దసంఖ్యలో సమూహాలుగా జీవిస్తూ ఉండే ఆదిమ మానవులు ఎక్కువగా నీటి వనరులు లభ్యమయ్యే చోట నివాసాలు ఏర్పాటు చేసుకుని ఉండే వారని అప్పటి వారి ఆచారాలను, వ్యవహారాలను, ఆనాటి పరిస్థితులను బొమ్మలుగా రాతి గుహలలో చిత్రిస్తూ ఉండేవారు. అలాంటి ఆనవాళ్లు అప్పుడప్పుడు బయటపడుతూ పరిశోధకులను నివ్వెర పోయేలా చేస్తునేవున్నాయి అలాగే వారు ఉపయోగించిన రాతి పనిముట్లు కూడా బయటపడుతూ అప్పటి పరిస్థితులు ఎలా ఉండేవన్నది స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల పురావస్తు శాఖ బృందం ఆధ్వర్యంలో ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేసారు. ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన అరుదైన రాతి చిత్రాలతో పాటు ఆ కాలంలోని ప్రజలు వాడిన అనేక సూక్ష్మరాతి పనిముట్లు దొరికినట్లు పురావస్తు శాఖ అధికారులకు లభ్యమయ్యాయి.. ఆ పనిముట్లలో వారు జంతువులకు వేటాడడానికి ఉపయోగించిన బాణం ములుకుల, ఈటెలు వంటివి బయట పడ్డాయి.. చిన్నప్పుడు మధ్య, రాతి యుగం నాటి నాగరికత గురించి చరిత్ర పుస్తకాలలో అందరం చదివే ఉంటాం.చూసే ఉంటాం. ఆ పుస్తకాల్లో ఆ యుగంనాటి వారి అలవాట్లు ఆచారాల గురించి ఎంతో స్పష్టంగా తెలుసుకున్నాం అయితే అచ్చు పుస్తకాల్లో రాసినట్టుగానే ఉన్నటు వంటి గుర్తులు, ఆధారాలు పురావస్తు శాఖ వారు చేపట్టిన అధ్యయనంలో దొరకడం విశేషం. ఇక్కడి పరిశోధనలలో ఆ యుగంలోని ప్రజలు జంతువులను వేటాడడానికి రాతి ములుకులను కర్రకు గుచ్చి ఉపయోగించేవారని పురావస్తు శాఖ అధికారులు చెబుతున్నారు. అంతే కాక వారు రంగులకు ఉపయోగించి పెద్ద పెద్ద రాళ్లపై మనుషులు, జింకలు బొమ్మలు ఎరుపు, తెలుపు రంగుల్లో వేసేవారని, అవి కూడా దొరికాయని తెలిపారు. అయితే ఒకేచోట రెండు రకాల రంగులతో చిత్రాలుండటం అరుదైన అంశం అని చరిత్ర బృందం వెల్లడించారు. ఇది వరకు ఇలాంటి బొమ్మలు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పాండవుల గుట్ట లో కనిపించాయని, మళ్లీ అలాంటి మేకబోమ్మ హాజీపూర్ మండలంలోనే కనిపించిందని తెలిపారు. ప్రస్తుతం కనిపించిన రాతి చిత్రాల వైశాల్యం, నీటివనరులు, పరిసరాల్ని పరిశీలిస్తే మధ్య రాతియుగంలో ఆదిమ మానవులు పెద్దసంఖ్యలో ఈ ప్రాంతంతో జీవనం సాగించినట్లు తెలుస్తోంది
previous post
next post