Vaisaakhi – Pakka Infotainment

యువర్ స్క్రీన్ పై యుద్ధం.. ఆన్ లైన్ టికెట్ల అమ్మకాలపై ఎగ్జిబిటర్ల అసహనం

సినిమాను నమ్ముకున్నోళ్లకష్టాలు ఇప్పట్లో వదిలేటట్టులేవు.. నిర్మాతలు, దర్శకులు, నటీనటులు వీళ్ళ సంగతి పక్కన పెడితే ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మాత్రం యుద్ధం ప్రకటించేశారు.. కోవిడ్ తదనానంతర పరిస్థితుల్లో థియేటర్ కు ప్రేక్షకుడు మొహం చాటేశాడు. ఎంతో టెంప్ట్ అయితే తప్పా ధియేటర్ కి రానంటున్నాడు.. పెద్ద చిత్రాలకు మినిమం కలెక్షన్స్ లేక చిన్న చిత్రాలు కనీసం షోలకు కూడా నోచుకోక విలవిలలాడిపోతున్నాయి. ఓటీటీ కారణాన్ని చూపి ధియేటర్ లో సినిమాకి దూరమైన ప్రేక్షకుడిని తిరిగి రప్పించాలంటే ఓటీటీ ని నిర్మాతలు పక్కన పెట్టాల్సిందే అంటున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీలుకొస్తున్న యువర్ స్క్రీన్ యాప్ పట్ల కూడా మెజారిటీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తీవ్ర విముఖత చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ యజమాన్యాలు దపదపాలుగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఓటిటి లో విడుదలవు తున్న సినిమాలకు అడ్డుకట్ట వేస్తే గాని సినిమాలు బతకవని ఇప్పటికే థియేట‌ర్ల ప‌రిస్థితి అత్యంత ద‌య‌నీయంగా ఉందని యజమానులు వాపోతున్నారు.  కరోనా నుంచి ఇంకా కోలుకోలేదని, సినీ ఇండ‌స్ట్రీ మొత్తం థియేట‌ర్లకు అండ‌గా నిల‌బ‌తున్నప్పటికీ ప్రభుత్వం తీసుకుంటున్న చ‌ర్యలతో ప‌రిస్థితి అదుపు త‌ప్పుతుంద‌నే అభిప్రాయం యాజ‌మాన్యాల్లో ఉంది.  డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేట‌ర్ల యాజ‌మాన్యాలు స‌ర్కార్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఫిల్మ్ డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ ద్వారా టిక్కెట్లు అమ్మాల‌ని నిర్ణయించ‌టంపై యాజ‌మాన్యాలు తీవ్ర అభ్యంత‌రం వ్యక్తం చేస్తున్నారు. బ్లాక్ టిక్కెట్లను నిలువ‌రించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంద‌ని చెబుతున్నప్పటికీ దీని వెనుక ఆర్థిక ప‌ర‌మైన అంశాలే కీల‌క‌మ‌ని అంటున్నారు. థియేట‌ర్ యాజ‌మాన్యాలు చేయాల్సిన ప‌నిని ప్రభుత్వం చేయాల‌నుకోవ‌టం, ఇందుకు రెవెన్యూ అధికారుల‌ను వినియోగించ‌టం వ‌ల‌న లాభం క‌న్నా న‌ష్టమే అధికంగా ఉంటుంద‌నే అభిప్రాయం ఉంది. రాష్ట్రంలో అనేక స‌మ‌స్యలు ఉండ‌గా ప్రభుత్వం థియేట‌ర్ యాజ‌మాన్యాలు, డిస్ట్రిబ్యూట‌ర్లకు సంబంధించిన అంశాలపై పై చేయి సాధించేందుకు ప్రయ‌త్నించ‌టంతో ఒక ర‌కంగా న‌వ్వుల పాల‌య్యింది.  ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ముందు అనేక స‌వాళ్లు ఉన్నాయి. వాటిని ప‌ట్టించుకోకుండా కేవ‌లం సినిమా రంగంపై ఆధార‌ప‌డి ఉన్న వ్యక్తులు, సంస్థల‌ను ఇబ్బందుల‌కు గురి చేయ‌టంపై తీవ్రస్థాయిలో దుమారం చెల‌రేగింది. ప్రభుత్వం తీసుకువ‌చ్చిన జీవోపై డిస్ట్రిబ్యూట‌ర్లు, థియేట‌ర్ ల యాజ‌మాన్యాలు కోర్టును  ఆశ్రయించాయి. కోర్టు కూడా ప్రభుత్వ చ‌ర్యల‌ను త‌ప్పుబ‌ట్టింది. అయినా సరే అధికారులు ఒప్పందపత్రాలపై సంతకాలు చెయ్యాలని వత్తిడి చేస్తున్నారని ప్రభుత్వం విడుదల చేసిన జీవో లో డబ్బులు తిరిగి ఎప్పుడు ఇస్తారో అన్న స్పష్టత ఇవ్వలేదని అంటూనే ఒకవేళ షో ఆగిపోతే ప్రేక్షకుడికి డబ్బు ఎవరిస్తారు ఎప్పుడిస్తారు లాంటి ఎన్నో అంశాలకు ఆ జీవో లో సమాధానమే లేదని చెప్తున్నారు. తప్పదు అనుకుంటే థియేటర్లు మూసివేయాడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో అన్ని అంశాలు చ‌ర్చించి కార్యచ‌ర‌ణ ప్రక‌టిస్తామ‌ని వెల్లడించారు

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More