విదేశాలు వెళ్లాలంటే కంపల్సరీ గా కావాల్సింది వీసా. ఒక్కొదేశం తమ భద్రతా విధానాలను అనుసరించి విసా లు జారీ చేస్తుంటాయి. కొన్ని దేశాల వీసా జారీ చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది మరి కొన్ని దేశాలు విజిట్ వీసా ను ఇస్తుంటాయి. అయితే మనదేశం నుంచి 16దేశాలకు వీసాలు లేకుండా వెళ్ళిరావచ్చు. కేవలం పాస్పోర్ట్ ఉంటే హ్యాపీ గా ఆ దేశాలలో విహరించి ఎంజాయ్ చెయ్యొచ్చు. భారతీయులను వీసా లేకుండా తమ దేశాలల్లోకి అనుమతించే ఆ దేశాలేంటంటే.కరీబియన్ రీజియన్ లోని బార్బొడోస్ దీవులలో విహరించాలనుకుంటే పాస్పోర్ట్ ఉంటే చాలు బ్రిడ్జ్ టౌన్ ఇక్కడి పెద్దనగరం కాగా బార్బడీయన్ డాలర్ చెలామణి లో ఉంది మంచి ప్యాకేజి అందుబాటులో ఉంటే ఎంజాయ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. చైనా ప్రభావం ఎక్కువగా ఉండే హాంకాంగ్ లో కూడా విహరించడానికి కూడా వీసా అవసరం లేదు. అలాగే కరేబియన్ ద్వీపసమూహం లో వుండే మరొదేశం డొమెనిక కు కూడా వీసా లేకుండా చెక్కేయచ్చు. సౌత్ ఏషియా దేశాలలో ఒకటైన బౌద్ద దేశం భూటాన్ కి కూడా నో వీసా. పర్వత ప్రాంతాలు, హిమాలయ అందాలు, బౌద్దరామాలు ఇలా ఎన్నో మనల్ని కట్టిపడేసే అందాలు భూటాన్ సొంతం టీంపూ రాజధానిగా ఉన్న రాజరిక వ్యవస్థ బలంగా ఉన్న ఈ దేశం లో మన రూపాయి హ్యాపీ గా వాడేసుకోవచ్చు. భారతీయులు ఎక్కువగా విజిట్ చేసే రిపబ్లిక్ ఆఫ్ మాల్దీవ్స్ కూడా వీసా అక్కరలేదు. మాల్దీవియన్ రూఫియా అధికారిక కరెన్సీ అయినప్పటికీ మాగ్జిమం అన్ని పర్యాటక ప్రాంతాల్లో అమెరికన్ డాలర్ చెల్లుబాటు అవుతుంది. మనదేశానికి మరీ పొరుగున హిమాలయాలకు ఆనుకుని ఉన్న వీసా అవసరం లేని దేశం నేపాల్. ఆధ్యాత్మికంగా పర్యాటకం గా బాగా గిట్టుబాటు అయ్యే దేశం ఇది. ఇక రిపబ్లిక్ ఆఫ్ సెర్భియా కూడా వీసా అడగకుండానే భారతీయులను ఆహ్వానిస్తోంది. సెర్బియన్ దినార్ ఇక్కడి కరెన్సీ అలాగే సెయింట్ విన్సెంట్ అండ్ ది గ్రెనడైన్స్ వినడానికి పెద్ద పేరులా ఉన్న ఈ కంట్రీవెళ్లేందుకు కూడా వీసా అవసరం లేదు.మనదేశం నుండి ఎక్కువ మంది వెళ్లే మారిషస్ కి కూడా వీసా అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో మారిషస్ అందాలకు ఫిదా అయిన మనం కచ్చితంగా చూడాల్సిన దేశం ఇది. సెంట్రల్ సౌత్ ఫసిపిక్ ఒషన్ తీర దేశమైన సమోవా, రిపబ్లిక్ ఆఫ్ హైతీ, వెస్ట్ ఆఫ్రికా లోని సెనెగల్, నుయోయ్ ఐలెండ్, గ్రెనేడ, ట్రినిడాడ్&టొబాగో, మాంట్ సెరేట్ లాంటి మొత్తం పదహారు దేశాలు భారతీయులను వీసాలేకుండా సగౌరవంగా తమ దేశాలకు ఆహ్వానిస్తున్నాయి.ఇంకెందుకు ఆలస్యం బ్యాగేజ్ సర్దేయండి.
previous post
next post