Vaisaakhi – Pakka Infotainment

మృతదేహా అవయవాలతో ఔషధ తయారీ చేసేవారా…?

శతాబ్దాల క్రితమే.. మరణించిన వ్యక్తుల అవయవాలనుండి మాంసకణాల నుండి దీర్ఘకాల వ్యాధులను నయం చేసే ఔషధాలుగా తయారు చేసి వాడేవారని కొన్ని పరిశోధనలు తేటతెల్లం చేస్తున్నాయి. మృతదేహాల నుంచి సేకరించిన వేడివేడి రక్తం, శరీరంలోని కణజాలం, కొవ్వులను ఎండబెట్టిన మాంసాన్ని ఈ వైద్యంలో విరివిగా ఉపయోగించేవారట.. కొన్నిసార్లు మాంసాన్ని పొడిగాచేసి కూడా వాడేవారని ఎలాంటి వ్యాధులూ లేకుండా మరణించిన వ్యక్తి తాజా మాంసాన్ని మేలైన ఔషధంగా అప్పట్లో వైద్య నిపుణులు భావించేవారట. హింసాత్మకంగా మరణించిన వ్యక్తుల శరీర పదార్థాలకు వైద్యంచేసే శక్తి మరింత ఎక్కువగా ఉండేదని బాగా నమ్మేవారు. మృతదేహాలతో చేసే ఇలాంటి చికిత్సలు ఆధునిక వైద్య చరిత్రలో మనకు అసలు కనపడవు. అయితే, ఇవి మూఢనమ్మకాలు, దొంగ చికిత్సల కంటే కాస్త భిన్నమైనవిగా కనిపిస్తాయి. ఈ చికిత్సలను చాలా మంది విద్యావేత్తలు కూడా నమ్మేవారు. తత్వవేత్త ఫ్రాన్సిస్ బేకన్, ఇంగ్లిష్ రచయిత జాన్ డన్, క్వీన్ ఎలిజబెత్ శస్త్రచికిత్సా నిపుణుడు జాన్ బానిస్టర్, రసాయన శాస్త్రవేత్త రాబెర్ట్ బాయిల్ ఈ చికిత్సలను బాగా నమ్మేవారట.. ఇందులో మమ్మీ వైద్యం పట్ల అప్పట్లో ఎక్కువ మంది ఆసక్తి చూపేవారని మానవ మృతదేహంతో చేసే ఈ చికిత్సలను ఒకరకమైన నరమాంస భక్షణగానే నిపుణులు పరిగణించేవారని నిపుణులు పేర్కొంటున్నారు. 15వ శతాబ్దం నాటికి నరమాంస భక్షణను ఈ తరహా వైద్యాన్ని ఐరోపా మొత్తం నిషేధించింది. అయినప్పటికీ ఇలాంటి వైద్యం రహస్యం గా కొనసాగుతూనే ఉండేది. ఇక్కడ 18వ శతాబ్దంవరకు ఈ వైద్యం కొనసాగితే జర్మనీలో వందేళ్ల ముందువరకు ఈ చికిత్సలు కొనసాగించినట్లు ఆధారాలున్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు. ఈ వైద్యంలో మరణానంతరం పుర్రెపై పెరిగే కొన్ని రకాల నాచులను కూడా ఉపయోగించేవారు. అంతర్గత రక్త స్రావాలను అడ్డుకునేందుకు చేసే వైద్యంలో మమ్మీల శరీర పదార్థాలకు ప్రాధాన్యం ఇచ్చేవారు. మూర్ఛ వ్యాధి చికిత్సలో అయితే, రక్తంతోపాటు పుర్రె పొడి కూడా వాడేవారు. ఈ వైద్యానికి సంబంధించి డర్హమ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన రిచర్డ్ సగ్ రాసిన పుస్తకం చర్చనీయాంశంగా మారింది. నరమాంస వైద్యంపై ఆయన ‘‘మర్డర్ ఆఫ్టర్ డెత్’’ పేరుతో రాసిన పుస్తకంలో చాలా ఆశ్చర్యకర విషయాలు, విస్తు గొలిపే అంశాలు ఎన్నో ఉన్నాయి. 1685లో మరణం అంచున ఉన్న కింగ్ చార్లెస్-2ను బతికించేందుకు ప్రయత్నించిన చికిత్సల్లో మానవ పుర్రె పొడితో వైద్యం కూడా వుందన్న ప్రచారం ఉందిని తెలిపారు. ఈ నరమాంస వైద్యాన్ని ఒక్కొక్కరు ఒక్కోలా చూసేవారు. కొందరు దీన్ని మూఢ నమ్మకంగా భావిస్తే, మరికొందరు దీన్ని వ్యాపారంలా చూసేవారని మరికొందరు మానవుల నుంచి సేకరించిన మేలిమి పదార్థాల వైద్యంగా దీన్ని పరిగణించేవారని ఇందులో పేర్కొన్నారు. ‘‘ఆధునిక వైద్యంలో మమ్మీలకు అసలు చోటులేదు. నేడు అలాంటి పద్ధతులను ఎవరూ పాటించడంలేదు. శాస్త్రీయ సాంకేతల్లో పురోగతి వల్ల ఆధ్మాత్మికత నుంచి సైన్స్ వేరుపడిందని 1780ల్లోనే ప్రముఖ వైద్యుడు సామ్యూల్ జాన్సన్ అనభిప్రాయపడితే మానవ రక్తం చాలా వ్యాధుల నుంచి రోగులను కాపాడగలదఅని అప్పటి ప్యూరిటన్ ప్రధాని ఎడ్వార్డ్ టేలర్ కూడా తన పుస్తకంలో రాసుకొచ్చారు. 1747లోనూ మూర్ఛ వ్యాధికి చికిత్సగా తాజా వేడి రక్తాన్ని తాగాలని రోగులకు ఇంగ్లండ్‌లో వైద్య నిపుణులు సూచించినట్లు కూడా ఆధారాలున్నాయని వివరిస్తున్నారు. హింసాత్మకంగా చనిపోయిన వ్యక్తిలో జీవాత్మలు (స్పిరిట్స్) గుండె, మెదడు, ఇతర కీలకమైన అవయవాల నుంచి వెంటనే బయటకు వెళ్లిపోతాయని, శరీర కణజాలం, జుట్టు లేదా చర్మంలోకి ఈ జీవాత్మలు చేరుతాయని ఇలాంటి మాంసం చాలా శక్తివంతమైనదని కూడా అప్పటివారు నమ్మేవారట ఒకవేళ వ్యక్తికి ఉరితీసి లేదా ఊరిపి ఆడకుండా గొంతుపట్టుకుని చంపితే, ఏడేళ్లవరకు అతడి పుర్రెలో జీవాత్మలు ఉంటాయని కొందరు భావించేవారు. అప్పటి ఈ వైద్యానికి మత విశ్వాసాలు తోడు కావడంతో ఆ కాలంలో ఈ వైద్యునికి బాగా ప్రాచుర్యం లభించిందని చరిత్రకారులు చెబుతున్నారు. 18వ శతాబ్దం వరకు కూడా కొన్ని దేశాలలో ఈ వైద్యం కొనసాగేదని అంటున్నారు. సమాజంలో చాలా వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేక రావడంతో ఈ వైద్యం కనుమరుగయిందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రపంచంలో చాలా చోట్ల ఈ వైద్యానికి సంబంధించిన వెలువడిన పలు పుస్తకాలు ఇప్పుడో కొత్త చర్చను మొదలు పెట్టాయి.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More