విజయ్ దేవరకొండ ఫర్ఫార్మెన్స్, డైరెక్టర్ పూరి టేకింగ్ కి పరాకాష్ట అంటున్నారు లైగర్ ఫాన్స్.. ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ తో విజయ్ దేవరకొండ ఈ మూవీతో పాన్ ఇండియన్ స్టార్ గామెరుపులు ఖాయమంటున్నారు డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఎలాగైనా హిట్ కొట్టాలని కసితో తీసినట్లు కనిపించింది. కొన్నేళ్లుగా పూరి టాలీవుడ్ టాప్ హీరోలతో సినిమాలు చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. తను రాసుకున్న కథకు న్యాయం చేయగల సత్తా ఉన్న హీరో విజయ్ దేవరకొండ మాత్రమే అని భావించి అతనితో వరుసగా మూడు సినిమాలకు కమిట్ అయ్యాడు. అందులో మొదటి చిత్రం ” లైగర్ “. ఈ మూవీ వచ్చేనెల రిలీజ్ కి సిద్ధంగా ఉంది. వీరి కాంబినేషన్లో ఇటీవలే ” జన గణ మన ” అనే రెండో చిత్రం కూడా షూటింగ్ ప్రారంభమైంది. ఇక మూడో చిత్రానికి కూడా రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాలిసి ఉంది. డైరెక్టర్ పూరి ఇలా ఒకే హీరోతో వరుసగా సినిమాలు చేసింది ఒక్క రవితేజతో మాత్రమే. తర్వాత ఇప్పుడు ఆ సెంటిమెంట్ ను విజయ్ దేవరకొండ తో ప్రారంభించాడు. “లైగర్” మూవీ రిలీజ్ అయ్యాక సంచలనం సృష్టిస్తుందని పూరి గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక భవిష్యత్తులో విజయ్ దేవరకొండ ఇండియన్ టాప్ హీరోల్లో ఒకరిగా మారడం ఖాయమని పూరి స్పష్టం చేయడం జరిగింది.అటు విజయ్ దేవరకొండ కూడా పూరిని పూర్తిగా నమ్మాడు. ” లైగర్ ” రిలీజ్ అయ్యాక దేశమంతా ఈ సినిమా కోసమే మాట్లాడుకుంటుందని, తనకు మరో సూపర్ హిట్ చిత్రమవుతుందని గట్టిగా చెబుతున్నాడు. ఇప్పుడు విజయ్ దేవరకొండ ఫ్యాన్ బేస్ కూడా నార్త్ ఇండియాలో బాగా పెరిగింది. “లైగర్” మూవీ అతని కెరీర్ లోనే ఒక మైల్ స్టోన్ లా నిలిచి పోయే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ” లైగర్ ” మూవీ రిలీజ్ అయ్యాక భారీ కలెక్షన్లతో కుమ్మేసాలా కనిపిస్తుంది.