Vaisaakhi – Pakka Infotainment

భద్రాద్రిలో వరదలకు కుట్ర జరిగిందా..?

భద్రాద్రి వరదలు కూడా రాజకీయ రంగు పులుముకుంటున్నాయి. అవి ఇప్పుడు దేశాన్ని దాటి విదేశాలపై ఆరోపణ వరకు వెళ్ళింది. ఇటీవల కురిసిన వర్షాలకు కారణం ప్రకృతిప్రకోపం కాదని దీని వెనుక విదేశాల కుట్ర ఉన్నట్లు తనకు సమాచారం ఉందని సాక్షాత్తు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించడం తో అందరూ ఒక్కసారిగా క్లౌడ్ బరస్ట్ అనే పదం గురించి సెర్చ్ చెయ్యడం మొదలెట్టారు. కడెం ప్రాజెక్టు పై కుట్ర జరిగిందని దానికి క్లౌడ్ బరస్ట్(మేఘ విస్ఫోటనం)ను వాదుకున్నారని సంచలన ప్రకటన చేశారు.గతం లో అమర్నాధ్ యాత్రలో, లడక్, ఉత్తరాఖండ్ లో ఈ తరహా కుట్రలు జరిగాయని ఓ కొత్త వివాదానికి తెర తీశారు.అసలు ఈ మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్)ఏంటి..? ఒక గంటలో ఒక చదరపు కిలోమీటర్ పరిధిలో 110 మిల్లీ మీటర్ల వర్షం పడితే దానిని కుంభ వృష్టి క్లౌడ్ బరస్ట్ అంటారు.క్లౌడ్ బరస్ట్ అనేది చాలా అరుదుగా జరిగే ప్రక్రియ. దీనిని ముందుగా ప్రిడిక్ట్ చేసే అవకాశం లేదు.అలాగని దీనిని కృత్రిమంగా సృష్టించాలంటే ఒకే చోట మేఘాలని ఆపేసి అవి కురిసెట్లుగా చేయాలి. గతంలో రాజశేఖర రెడ్డి గహయాంలో కృత్రిమ వర్షం కురిపించడానికి వెదర్ రాడార్[డాప్లర్ రాడార్] లని నెలకొల్పి ఆకాశం నుండి విమానం ద్వారా సాలిడ్ సిల్వర్ అయోడిన్[సిల్వర్ అయోడిన్ స్ఫటికములు రూపంలో ] మేఘాలలోకి వదలి మేఘ మధనం జరిపారు. అయితే అవి సత్ఫలితాలను ఇవ్వలేదు.ప్రతిపక్షాలనుంచి కూడా తీవ్ర విమర్శలు రావడం తో ఆ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేశారు. అలాంటిది దట్టమయిన మేఘాలని అదీ ఒకే చోట నిలిపి ఉంచి అవి వర్షించేట్లుగా చేశారు అన్న ముఖ్యమంత్రి ఆరోపణ కొత్త చర్చకు దారితీసింది. విదేశాల కుట్ర అయితే పొరుగున ఉన్న చైనా, పాకిస్తానో చెయ్యాలి ఆ దేశాలు బోర్డర్ లో కాకుండా భద్రాద్రి లో ఎందుకు చేస్తాయి అన్నది అంతుచిక్కని ప్రశ్నే అని ప్రతిపక్షాలు అంటున్నాయి. గత వారం రోజులుగా పడుతున్న వర్షాలు ఎక్కడా కూడా ఒకే రకంగా పడలేదు. 2015 ముంబై లో ఒకే రోజులో 110 మిల్లీ మీటర్ల వర్షం పడ్డది. దాంతో ముంబై నగరం వారం రోజులుపాటు స్తంబించిపోయింది. పల్లపు ప్రాంతాలు 4 అడుగుల లోతు నీళ్ళలో మునిగిపోయాయి సముద్రంలోకి దారి తీసే డ్రైనేజీ వ్యవస్థ మూసుకు పోవడం ఒక కారణం అయితే సముద్రం నీరు భూమి మీదకి ఎదురు తన్నడం రెండవకారణం గా నీళ్ళు నిలిచిపోయాయి.ఇక అమరనాథ్ లో వచ్చిన దానిని ఫ్లాష్ ఫ్లడ్ అంటారని హిమాలయ ప్రాంతాలలో ఇవి సర్వ సాధారణంగా జరిగేవేననీ నిపుణులు అంటున్నారు. అమరనాథ్ ప్రాంతంలో ఎత్తైన పర్వత ప్రాంతాల కారణంగా అక్కడ మంచు కరిగి ఆ నీళ్ళు అక్కడే నిలవ ఉంటాయి వాటికి తోడు పెద్ద వర్షం పడితే ఆ నీరు బురదని తనతో తీసుకొని కిందకి వేగంగా ప్రవహిస్తుంది. ఇది నిత్యం జరిగేదే అక్కడ. డానికి విదేశీ కుట్ర అని ప్రజలకి అర్ధంకాని పదాలని వాడి ప్రజలను గందగోళం లోకి నెట్టేస్తున్నారని అంటున్నారు గ్లోబలైజేషన్, ప్రకృతి విధ్వంసం, నదీ పరివాహక ప్రాంతాల్లో పెద్ద పెద్ద భవంతులనిర్మాణం ఇలాంటివి మేఘాలు ఒకేసారి కోలాప్స్ అయి ఇలాంటివి జరుగుతూ వుంటాయని మెట్రోలజీ విభాగ నిపుణులు చెపుతున్నారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More