ఒకే ఒక సినిమా హిట్ తో పాన్ ఇండియా హీరో ల ఫీలయిపోతున్న ఆ హీరో యవ్వారం మామూలుగా లేదంటూ ఫిలిం నగర్ లో చాలామంది సినీజనాలు ఓ తెగ ఇదైపోతున్నారు. సాఫ్టుగా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకొనొచ్చి ఒకటి ఆరా షార్ట్ ఫిలిమ్స్ చేసి ఎప్పుడొచ్చిందో… ఎప్పుడెళ్లిందో తెలియని షార్ట్ కి ఎక్కువ సినిమా కి తక్కువ వుండే ఓ ఫిల్మ్ ని కూడా హిట్ జాబితాలో కలిపేసి తనఖాతా లో రెండు హిట్లు ఉన్నాయని చెప్పుకునే ఆ హీరో బిల్డప్ లు చూసి అందరూ ఈడెవడ్రా బాబూ… అనేసుకుంటున్నారట..! బ్యాక్ టూ బ్యాక్ రెండు ప్లాప్ లు ఇచ్చిన ఈ హీరో సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెడితే జనాలు ఓ ఆట ఆడేసుకున్నారు. నా రెమ్యూనరేషన్ తగ్గించుకుంటా… నా సినిమా టిక్కెట్ రేట్ పెంచను. ఇలాంటి స్టేట్మెంట్స్ చూసి ఒరేయ్ నీకు అంత సీనులేదురా అని డైరెక్టుగానే కామెంట్లు పెట్టేసారు. సినిమా ప్రోమోషన్లకు తనవంతు సొంతమనీ తో వ్యూస్ పెంచుకునే సదరు సహజనటుడు(ఎక్స్ప్రెషన్ లేకుండా నటిస్తుంటే ప్రస్తావిస్తున్న పదం) గొప్ప రచయిత కూడా.. కొన్ని సినిమాలకు స్క్రీన్ ప్లే లు మరికొన్ని సినిమాలకు డైలాగ్స్. దాదాపు అన్ని సినిమాలకి ఎలివేషన్స్ రాసేసుకుంటాడు ఈ సకల కళా వల్లవన్.. ఎదో సెలబుల్ హీరో దొరికితే నాలుగు పైసలు ఎనకేసుకునేద్దాం అని కాసుక్కుసున్న కొందరు నిర్మాతలు ఏ హీరో డేట్స్ దొరక్క ఓ రాయెద్దమని ట్రై చేస్తున్న దర్శకులతో వచ్చే రెండేళ్ల వరకూ డైరీ ఖాళీ లేని ఈ నటుడు సగం లో సినిమా దర్శకులని కూడా మార్చేస్తున్నాడటా.. కష్ట పడి పైకి రావడమంటే ఎదుటివాడి కష్టాన్ని కెరీర్ ని కొట్టడం కాదని కూడాతెలుసుకోవాలి కదాని అంటూనే బాబోయి ఇన్ని కళలా…? అని నోరెళ్ల బెట్టేస్తున్నారట విన్నోళ్లు.. కొసమెరుపు ఏంటంటే ఇండోర్ స్టూడియోల్లో జరిగే షూటింగ్ లకు కూడా బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడం ఇతగాడి ప్రత్యేకత. బావుంది రా అబ్బాయి..జరిగితే జల్లెడ తో నీళ్లు మొయ్యమన్నారట.. ఇండస్ట్రీ ఎంతో మందిని చూసింది. కాలరేగరేసే వాళ్ళు కాలగర్భం లో కలిసిపోయారు.. ఎంత ఎదిగిన ఒదిగిన వాళ్ళు శిఖరాలను తాకారు.. ఇదే పరిశ్రమ మనముందుంచిన సత్యం. జరా యినుకో…