భారతదేశం గొప్పతనాన్ని తెలియచెప్పే ఎన్నో చారిత్రక కట్టడాలు దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతాలలో ఉన్నాయి. కొన్ని కట్టడాలు దేశ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తే.. మరి కొన్ని కట్టడాలు దేశ ఔన్నత్యాన్ని, ఆధ్యాత్మికతను, కళల ప్రాశస్త్యాన్ని , వీరత్వాన్ని తెలియజేస్తున్నాయి. అటువంటి అద్భుత కట్టడాలలో ప్రపంచ వారసత్వ సంపదగా యునేస్కొ చే గుర్తించబడిన ప్రదేశం. మహాబలిపురం పట్టణంలో ఉంది. దీనిని మహిషాసుర మర్దిని గుహ లేదా మంటప అని పిలుస్తుంటారు. హిందూ మహాసముద్రం లోని బెంగాల్ బే అనుకుని కోరమాండెల్ తీరంలో మహాబలిపురం లోని ఇతర గుహలతో పాటు కొండ శ్రేణి పైభాగంలో ఈ ప్రదేశం ఉంది. ఇప్పుడు కాంచీపురం జిల్లాలో ఇది చెన్నై నగరానికి సుమారు 58 కిలోమీటర్లు చింగెల్పేట్ నుండి దాదాపు 32 కిమీ దూరంలో ఉంది. ఈ గుహకు సమీపంలో మామల్లపురం యొక్క సుందరమైన దృశ్యాలను అందించే వాన్టేజ్ ప్రదేశం కూడా ఉంది. ఇక్కడ దక్షిణప్రాంతంలో న్యూక్లియర్ పవర్ స్టేషన్ ఉంది ఈ ప్రాంతం అధిక భద్రతా జోన్ లో ఉండడం ఫోటోగ్రఫీ నిషేదించబడింది. ఈ గుహ దేవాలయం అనేక ఆసక్తికరమైన నిర్మాణ లక్షణాలను కలిగి ఉంది. వీటిలో మూడు గర్భాలయాల గుహ గోడలపై అద్భుతంగా చెక్కబడిన శిల్పాలు ప్రముఖంగా ఉన్నాయి. ఒకటి విష్ణువు ఏడు ముగ్గులున్న పాముపై ఆయన, ఆదిశేషుడు, మరొకటి దుర్గ, గుహ దేవాలయం దుర్గ ప్రధాన దేవత దుర్గ గేదె తలగల రాక్షసుడు మహిషాసురుని వధించడం, మూడో గర్భగుడిలో శివుడి శిల్పం. ఇవి ఎంతో అద్భుతంగా చెక్కబడి ఉన్నాయి. ఈ గుహ పల్లవ వంశానికి చెందిన రాజు నరసింహవర్మన్ మహామల్ల (క్రీ.శ. 630–668) కాలం నాటిదని చరిత్రకారులు చెబుతున్నారు. అతని పేరు మీదనే ఈ పట్టణానికి పేరు కూడా పెట్టారనే తెలుస్తుంది. ఈ గుహ నిర్మాణం పశ్చిమ భారతదేశంలో చెక్కబడిన గొప్ప నిర్మాణమని చెబుతున్నారు. ఈ గుహను పల్లవ రాజులలో రాజసింహ లేదా నరసింహవర్మన్ , మామల్లాగా పిలవబడే పల్లవ రాజుల పాలనలో నిర్మాణం జరిగిందని చరిత్రకారులు అంటున్నారు. గుహలోపల అద్భుతమైన నిర్మాణ శైలి అందర్నీ ఆకట్టుకునే విధంగా ఉంది. అప్పటి వ్యవస్థను, సంస్కృతిని ప్రతిబింబించే నిజంగా ఉంది. మామల్ల కుమారుడు పరమేశ్వరవర్మన్ హయాంలోనూ ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని తెలుస్తోంది అయితే మహాబలిపురం పట్టణం మామల్ల పేరు పెట్టబడిన తర్వాత మాత్రమే స్థాపించబడిందని చారిత్రక పరిశోధనలు ధృవీకరించాయి. అక్కడి గుహలు , రథాలు 650 ఏ డీ లో అతని పాలనకు ప్రతీక గా నిలిచాయని పరిశోధకులు పేర్కొంటున్నారు.
previous post