గత కొన్నిరోజులుగా నెలకొన్న మహాసంక్షోభం బలపరీక్ష కార్డు తో శుభం పడబోతుంది.. గురువారం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం బలపరీక్ష ను ఎదుర్కోబోతున్న నేపథ్యంలో లో జరిగిన మహారాష్ట్ర కేబినేట్ తీసుకున్న కీలక నిర్ణయాలు హిందుత్వ ముద్రకోసం స్వతహాగా తనను తాను హిందుత్వ వాది గా ప్రోజెక్ట్ చేసుకునే ప్రయత్నమే నని విశ్లేషకులు భావిస్తున్నారు. హిందుత్వ ఎజెండా తోనే షిండే వేరు కుంపటి పెట్టి అసమ్మతి ని కూడగట్టిన తరుణం లో ఈ నిర్ణయాలు తీవ్ర చర్చనీయాంశంఅయ్యాయి. ఔరంగబాద్ పేరుని శంబాజీ నగర్ గా ఉస్మానాబాద్ పేరు ను ధారాశివ్ గా పేర్లు మార్చడం తో పాటు నవీముంబై ఎయిర్పోర్ట్ పేరు ను డీబీ పాటిల్ ఎయిర్ పోర్ట్ గా మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంది.. రాష్ట్ర ప్రజలకు కృతజ్ఞతలు చెప్తూ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రసంగ పాఠం ఉండడం వెనుక అసలు విషయం అందరికీ చెప్పినట్టే నని అంటున్నారు.
previous post
next post