జూలై 2, 3 తేదిలలో హైదరాబాద్ లో భారతీయ జనతా పార్టీ జాతీయకార్యవర్గ సమావేశాలు ప్రధాని నరేంద్రమోడి బహిరంగసభ నేపధ్యంలో నగరాన్ని కాషాయమయం చెయ్యాలనుకున్న ఆ పార్టీ కి తెలంగాణ ప్రభుత్వం గట్టి జలక్ ఇచ్చింది. తెలంగాణ లో అధికారమే లక్ష్యం గా పావులు కదుపుతున్న భారతీయ జనతాపార్టీ తెరాసపై… కెసిఆర్ పై.. పోరాటాన్ని ఉదృతం చేసింది.. పార్టీ కార్యాలయం దగ్గర ‘సాలుదొర..సెలవు దొరా…” పేరిట ఏర్పాటు చేసిన కౌంట్ డౌన్ డిజిటల్ స్క్రీన్ అధికార టీఆరెస్ కు చాలా కోపం తెప్పించింది.. ఈ స్క్రీన్ తొలగించమని పోలీసు వర్గాలు కూడా వత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఇదిలా వుంటే ప్రధాని సభ ద్వారా తమ బలాన్ని , భవిష్యత్తు ప్రణాలికను చాటి చెప్పాలనుకున్న బిజెపి కి వ్యూహాత్మకంగా బదులిచ్చే ప్రయత్నాలకు తెరాస తెర లేపింది. భారీ పబ్లిసిటీ తో అధిష్టానానికి రాష్ట్ర బలం చూపించే ఆలోచనలకు ఆది లోనే గండి కొట్టింది. తెలంగాణప్రభుత్వం సాదించిన విజయాల ప్రచార హోర్డింగ్ లను నగరమంతా నింపేసి కమల ప్రచారానికి హోర్డింగ్లు గాని , మెట్రో పిల్లర్లు గాని దొరకకుండా చెయ్యాలని ముందస్తు ప్లాన్ అమలు చేసేసింది. దాదాపు 2,300 మెట్రో పిల్లర్ హోర్దింగ్ లు దాదాపు వెయ్యికి పైగా బస్సు స్టాపులలో ప్రభుత్వ ప్రచారానికి ముందే ఒప్పందం చేసేసుకుని హోర్డింగ్ లు ఏర్పాటు చేసింది దీంతో ఖంగుతిన్న బిజెపి ప్రచారశాఖ మిగిలిన రోడ్లను నమ్ముకుంది. అంత హడావిడి గా ఇప్పటికిప్పుడే ప్రభుత్వ పధకాల ప్రచారం అవసరమా…? అని బాజాపా వర్గాలు ప్రశ్నిస్తుంటే ప్రజలకు మేలు చేసాం కాబట్టే చెప్పుకుంటున్నాం అని అధికార పార్టీ వర్గాలు కౌంటర్ ఇస్తున్నాయి…
previous post
next post