మధ్యప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా షాపూర్ కు చెందిన హరీశ్ మహాజన్ తన భార్యకు పుట్టినరోజు కానుక గా చంద్రుడిపై ఎకరం స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. వాస్తవానికి గతేడాదే జాబిల్లిపై స్థలం కొనుగోలు చేయాలని ఆయన భావించారు.అందుకోసం న్యూయార్క్ కు చెందిన ఇంటర్నేషనల్ లునార్ ల్యాండ్స్ సొసైటీ కి దరఖాస్తు చేసుకున్నారు. ఏడాది ప్రక్రియ అనంతరం.. రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను ఆన్‌లైన్‌లో పంపించారు. అయితే ఎంత డబ్బు చెల్లించిందీ మాత్రం వెల్లడించలేదు.ఇది ప్రేమకు సంబంధించిన విషయమని.. డబ్బుది కాదని చెప్పారు. తన భార్య కు వినూత్నమైన కానుక ఇవ్వాలనిపించి ఇలా చేశానని అంటుంటే కానుక అందుకున్న భార్య ఇలాంటి బహుమతి తన భర్త ఇస్తాడని అస్సలు ఊహించలేదని నిజం గా ఇదో గొప్ప సర్ప్రైజ్ అని ఆనందాన్ని వ్యక్తం చేశారు.మహాజన్ చంద్రుడిపై స్థలం కొన్న హిమాచల్ కు చెందిన రెండవ వ్యక్తి గతం లో హిమాచల్‌ప్రదే శ్‌లోని ఉనా జిల్లాకు చెందిన ఓ వ్యాపారవేత్త తన కుమారుడికి చంద్రుడిపై స్థలం కొనుగోలు చేసి ఇచ్చారు..
previous post