అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ప్రవాసాంధ్ర తెలుగు సొసైటీతో కలసి తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీనివాస కళ్యాణం ను కన్నుల పండువగా నిర్వహించింది. ఇండియన్ కమ్యూనిటీ సెంటర్‌లో జరిగిన స్వామివారి కల్యాణానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. తాళ్లపాక వంశస్థులు అమ్మవారి తరపున కన్యాదానం చేయగా వేంకటేశ్వరుడు తన ప్రియమైన భార్యలకు పవిత్ర మంగళ సూత్రాలను కట్టిన మాంగల్య ధారణతో దైవిక వివాహ వేడుక ఘనంగా ముగిసింది. ఇది సాధారణంగా దక్షిణ భారత హిందూ వివాహాల సమయంలో నిర్వహించబడే ప్రముఖమైన, వినోదాత్మకమైన క్రతువు. ఇందులో స్వామివారు అతని దేవేరులు ఒకరికొకరుఎదురుగా పూల బంతులు మరియు కొబ్బరికాయలతో ఆడుకునే ఆటను దేవతల తరపున పూజారులు తాళ్లపాక వంశస్థులు నిర్వహించారు అనంతరం దేవతామూర్తుల పూలమాలలు మార్చి తంతు కొనసాగించారు శ్రీదేవి కుడి వైపున, భూదేవి ఎడమ వైపున ఆశీనులైన ఈ వేడుక చివరగా కర్పూర హారతి, నక్షత్ర హారతి, మహా హారతి తో ముగిసింది. శ్రీవారు అమ్మవార్ల కల్యాణ ఘట్టాన్ని నేత్రపర్వంగా తిలకించిన భక్తులు భక్తిపరవశంతో పులకించారు. కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవీ సుబ్బారెడ్డి దంపతులు ప్రవాసాంధ్రుల సమితి చైర్మన్ శ్రీ మేడపాటి వెంకట్, ఎస్వీబీసీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాస రెడ్డి, అమెరికాలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి శ్రీ రత్నాకర్, నాటా అధ్యక్షుడు శ్రీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
previous post