ఆంద్రప్రదేశ్ నుంచి ఖాళీ అయిన నాలుగు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది వైస్సార్ సీపీ.. అందులో ఇద్దరు తెలంగాణ కు చెందిన వ్యక్తులు కాగా.. అందులో ఒకరు సినినిర్మాత. చిరంజీవి, రాంచరణ్ తో ఆచార్య మూవీ నిర్మించిన నిరంజన్ రెడ్డి కి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దల సభకు ప్రమోట్ చేశారు… వృత్తి రీత్యా న్యాయవాది అయిన నిరంజన్ రెడ్డి వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుల్లో సుప్రీం కోర్ట్, హైకోర్టు, సీబీఐ, ఈడీ కోర్టు లలో జగన్ తరపు తన వాదనలను వినిపించారు. మ్యాట్నీ ఎంటర్టైమెంట్ బేనర్ పై ఘజీ, రాజుగారి గది2, వైల్డ్ డాగ్ వంటి చిత్రాలను నిర్మించారు.. తాను నిర్మించిన ఆచార్య సినిమా ప్లాప్ అయిన రాజకీయాలలో హిట్ అయి రాజ్యసభ కు వెళ్తున్నారు నిరంజన్ రెడ్డి.
previous post