ఆర్ధిక రాజధాని ముంబైలో శ్రీనివాసుడి ఆలయం నిర్మించనున్నారు. ఇందు కోసం మహారాష్ట్ర సర్కార్ 10 ఎకరాల భూమిని తిరుమల, తిరుపతి దేవస్థానానికి అందజేసింది. త్వరలో భూమిపూజ చేసి ఆలయం నిర్మాణం పనులు ప్రారంభించాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించింది. ఈ మేరకు మహారాష్ట్ర టూరిజం మంత్రి ఆదిత్యా ఠాక్రే.. శ్రీవారి ఆలయం నిర్మాణం నిమిత్తం కేటాయించిన భూమి పత్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి అందజేశారు.నవీ ముంబైలో మహారాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన ఈ భూమి విలువ దాదాపు రూ.500 కోట్ల వరకు ఉంటుందని మహారాష్ట్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ముంబైలోని అత్యంత విలువైన భూమిని ఆలయ నిర్మాణం కోసం కేటాయించడం పట్ల శ్రీవారి భక్తులు హర్షం వ్యక్తం చేస్తూ మహారాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా ఆలయం నిర్మాణం వ్యయాన్ని భరించేందుకు రేమాండ్ గ్రూప్ సీఎండీ గౌతమ్ సింఘానియా ముందుకు వచ్చారు..
previous post
next post