డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్‌తో దర్శకుడిగా సక్సెస్ ఫుల్ డెబ్యు చేసిన తర్వాత, తన అప్ కమింగ్ డైరెక్షనల్ వెంచర్ ‘నాగబంధం- ది సీక్రెట్ ట్రెజర్’ ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. అభిషేక్ నామా అభిషేక్ పిక్చర్స్‌తో కలిసితారక్ సినిమాస్ NIK స్టూడియోస్ లు సంయుక్తంగా ప్రొడక్షన్ నంబర్ 1 గా కిషోర్ అన్నపురెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని లక్ష్మీ ఐరా, దేవాన్ష్ నామా సమర్పిస్తున్నారు. ప్రత్యేక అతిథుల సమక్షంలో ప్రారంభమైన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి ముహూర్తం షాట్‌కి క్లాప్ కొట్టారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచాన్ చేయగా, తొలి షాట్‌కి అజయ్ భూపతి దర్శకత్వం వహించారు. ఏషియన్ సునీల్ స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు.
‘పెదకాపు’ సినిమాతో పరిచయం అయిన విరాట్ కర్ణ, ‘నాగబంధం’ చిత్రంలో లీడ్ రోల్ పోషిస్తున్నారు. ఇందులో నభా నటేష్, ఐశ్వర్య మీనన్ ఫిమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. జగపతి బాబు, జయప్రకాష్, మురళీ శర్మ, బి.ఎస్. అవినాష్ ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. నాగబంధం 2025లో తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఈ నెల 23న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.
మెస్మరైజ్ చేసే ఇంట్రో వీడియో ప్రేక్షకులను కట్టిపడేసింది. KGFలో తన పాత్రతో పేరు తెచ్చుకున్న అవినాష్ అఘోరాగా కనిపించారు.
ఈ చిత్రంలో VFX, ప్రొడక్షన్ వాల్యూస్, టెక్నికల్ స్టాండర్డ్స్ అద్భుతంగా వుండబోతున్నాయి.
ఈ చిత్రానికి సౌందర్ రాజన్ డీవోపీగా పని చేస్తున్నారు, అభే సంగీతం అందిస్తున్నారు. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ రాయగా, సంతోష్ కామిరెడ్డి ఎడిటర్. అశోక్ కుమార్ ప్రొడక్షన్ డిజైనర్.