Vaisaakhi – Pakka Infotainment

తిరుమల లడ్డూ ప్రసాదానికి పలాస జీడిపప్పు

తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం లో వాడే జీడిపప్పును సరఫరా చేసేందుకు పలాసకు చెందిన వ్యాపారి కోరాడ సంతోశ్ (ఎస్.ఎస్.ఎస్ ఇంటర్నేషనల్ ఆగ్రో )టెండర్ దక్కించు కున్నారు. మూడు రోజుల కిందట గ్లోబల్ విధానంలో పిలిచిన టెండర్లలో కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన వందలాది వ్యాపారులు పోటీ పడగా పలాస వ్యాపరీ టెండర్ దక్కించుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో రోజుకు మూడు టన్నుల జీడిపప్పు తిరుపతి లడ్డూల తయారీకి అవసరం అవుతుంది సుమారు 45 సంవత్సరాల క్రితం తిరుపతి లడ్డు తయారికి పలాస జీడిపప్పు సరఫరా అయ్యేది..మళ్ళీ ఇన్నాళ్ళకు మళ్ళీ మనకు అవకాశం వచ్చిందని ఆ వ్యాపారి ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More