వరదలతో అతలాకుతలం అయిన విజయవాడ కు పవర్ బొట్స్ చేరుకున్నాయి ముఖ్యమంత్రి కేంద్రంతో మాట్లాడిన తరువాత వివిధ రాష్ట్రాల నుంచి ఈ బోట్స్ విజయ వాడ చేరుకున్నాయి..పూర్తి గా ముంపుకు గురైన సింగ్ నగర్ వాసులకు ఈ బోట్స్ ద్వారానే ఆహారం పంపిణీ చేయనున్నారు.
పెద్ద ఎత్తున బోట్స్ రావడంతో ఇళ్లనుంచి బాధితులను బయటకు తెచ్చే పనులు వేగవంతం చేయాలని అధికారులు భావిస్తున్నారు.. ఇప్పటికే పాల ప్యాకెట్లు, ఆహారం, నీళ్ళ బాటిల్స్ అందిస్తున్న ప్రభుత్వం
పునరావాస కేంద్రాలకు వెళ్లే వాళ్లకు దుస్తులు కూడా ఇవ్వాలనీ కూడా ఆదేశించింది. ప్రైవేటు హోటల్స్, దుర్గగుడి, అక్షయపాత్రల ద్వారా సమకూర్చిన ఆహారాన్ని పంపిణి చేయనున్నారు.ముంపు ప్రాంతాల్లో మరో సారి పర్యటనతో సహాయక చర్యలను పర్యవేక్షించిన ససిఎం సూచనలతో, క్షేత్ర స్థాయి పర్యటనలతో జిల్లా యంత్రాంగం కదలడం తో సహాయ చర్యలలో వేగం పుంజుకుంది
వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎం సమీక్ష
బుడమేరు సహా వరద ప్రభావ ప్రాంతాలలో నెలకొన్న పరిస్థితులు అందుతున్న సహాయ కార్యక్రమాలపై అందుబాటు లో వున్న మంత్రులు అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు.. విధుల్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా అందుతున్న సాయంపై వివరాలు అడిగి మిగిలిన హెలికాప్టర్లను కూడా వీలైనంత త్వరగా రప్పించాలని అధికారులను ఆదేశించారు
డివిజన్ల వారీగా ఆహార పంపిణీ ఎంతమేరకు చేశారో అలాగే
ఇతర జిల్లాల్లో తయారు చేసి తరలిస్తున్న ఆహారం పై కూడా ఆరా బాధితుల సెల్ ఫోన్ ఛార్జింగ్ కోసం పవర్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని కమ్యునికేషన్ లో అంతరాయం ఏర్పడకుండా చూడాలని చెప్పారు.. ఆహారంతో పాటు పండ్ల పంపిణీకి రానున్న రెండు రోజుల్లో బాధితులకు అందించేందుకు కూరగాయలు కూడా అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలు జారీ చేసారు.