గత కొంతకాలంగా మెగా కాంపౌండ్, అల్లు అర్జున్ మధ్య విబేధాలు తలెత్తిన విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో నంద్యాల ఎంపీ అభ్యర్థి వైఎసార్సీపీ నేత శిల్పా మోహన్ రెడ్డికి సపోర్ట్ గా అల్లు అర్జున్ ప్రచారం చేయడంతో మెగా కాంపౌండ్‌లో పెద్ద దుమారమే రేగింది. అయితే ఇది అప్పుడే రగిలిన వివాదం అయితే కాదు చాల రోజుల నుంచి కొణిదల వర్సెస్ అల్లు అన్నట్టుగానే వున్న ఈ చిచ్చు మరింత ముదిరింది.. దీంతో పవన్ , బన్నీ అభిమానుల మధ్య పెద్ద రచ్చే జరిగింది.
ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం బెంగళూరు పర్యటనలో భాగంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. 40 ఏళ్ల క్రితం హీరోలు అటవీ సంపదను కాపాడేవారని.. ఇప్పుడు అదే హీరోలు చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పుకొచ్చారు. దాంతో.. పవన్ ఆ కామెంట్స్ అల్లు అర్జున్‌ను ఉద్దేశించే చేశారని ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. ఇక మరోవైపు అల్లు అర్జున్ కూడా ఏమాత్రం తగ్గకుండా.. ఇటీవల జరిగిన ఓ ఫంక్షన్ లో నాకు నచ్చితే నేను వెళ్తా అంటూ.. ఖరాకండిగా చెప్పేశాడు.
తాజాగా ఐదే విషయంపై అల్లు అర్జున్ మామ, కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి స్పందిస్తూ ఈ వివాదంలో పవన్ కల్యాణే వివరణ ఇవ్వాలి. పవన్ ఏ ఉద్దేశంతో అలా మాట్లాడారో చెప్పాలి. కేవలం సినిమా కోసమే అల్లు అర్జున్ అలా నటించాడు. ఆ విషయం పవన్ కు తెలియదా. అలాంటప్పుడు ఎందుకు అలా మాట్లాడాలి. ఇకనైనా పవన్ జోక్యం చేసుకుని తాను చేసిన వ్యాఖ్యలకు క్లారిటీ ఇవ్వాలి. అప్పుడే ఈ వివాదానికి ఫుల్‌స్టాప్ పడుతుంది. అల్లు అర్జున్‌కు నేషనల్ అవార్డ్ వచ్చింది పాలిటిక్స్‌లో కాదు.. సినిమాల్లో. బన్నీ చాలా మెచ్యూర్ నటుడు. ఆయన తన అభిమానులకు, స్నేహితులకు ఏదో చేయాలనే ఆలోచనతో ఉంటారు.. అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన ఈ కమెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
previous post