సోషల్ మీడియా లో పాపులర్ అవ్వాలంటే ఏదో సంథింగ్ స్పెషల్ అనిపించుకోవాలి… అది పిచ్చితనమైన పర్వాలేదు.. వెకిలి తనమైన నో ప్రాబ్లం.. ట్రెండ్ కి తగ్గట్టుగా మితిమీరిన హాస్యం, శృతి మించిన శృంగారం.. ఇప్పుడున్న పరిస్థితుల్లో స్పీడ్ గా వైరల్ అయ్యే కంటెంట్.. నిజానికి సంప్రదాయ వీడియోలు ఈ ప్రవాహం లో కొట్టుకుపోతున్నాయి.. అలాంటి టైం లో సంప్రదాయ ఆహార్యం తో.. వైష్ణవ నామధారణ తో.. అంతకు మించిన అభినయంతో.. కొన్ని పాటలు తన స్వరం నుంచి.. మరికొన్ని పాపులర్ పాటలకు స్వరాభినయం తో ఇప్పుడు సోషల్ మీడియా ను షేక్ చేస్తున్న ఓ యువతి ఇప్పుడు సామాజిక మాధ్యమాల సంచలనం..భక్తి భావ తరంగాల మాధ్యమం.. ఆమె పేరు శ్రీ నవల్ కిషోరీ..
ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న బోర్డర్ లేదు.. మొత్తం భారత దేశం అంతా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నవల్ కిషోరీ కు ఫేస్బుక్, ఇన్స్టాగ్రాం, యూ ట్యూబ్, వంటి సొంత పేజ్ లే కాకుండా వందలాది ఫ్యాన్ పేజ్ లు కూడా వున్నాయి.. 2023జూన్ లో సోషల్ మీడియాకి ఎంట్రీ ఇచ్చిన కిషోరి అతి స్వల్ప కాలంలో మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. టిక్ టాక్ బ్యాన్ తరవాత ఆ తరహా నెటిజన్లు ఇన్స్టా రీల్స్ ని మొదలుపెట్టారు. నవల్ కిషోరీకి ఇంస్టా లో రెండు మిలియన్స్ కి మించి ఫాలోవర్స్ వున్నారు. కాన్పూర్ కి చెందిన ఈమె తండ్రి ఓ మీడియా సంస్థ లో పనిచేస్తున్నారట.. శ్రీ నవల్ కిషోరీ అన్నది ఆమె స్క్రీన్ నేమ్ మాత్రమే నట.. వయసు తారతమ్యం లేకుండా అశ్లీల పాటలతో లైకులు కోసం ప్రాకులాడే ఈ తరుణం లో నామ ధారణ చేసి పద్ధతిగా అభినయమే ప్రధానంగా అందరిని ఆకట్టుకుంటున్న నవల్ కిషోరీ లాంటి వాళ్ళు ఇప్పుడు సమాజానికి అవసరం.
సంప్రదాయం తో కూడా సెలబ్రిటీ అవ్వొచ్చని నిరూపించిన ఆమెకు అన్ని వైపుల నుంచి సవాళ్లే సోషల్ మీడియాని వల్గర్ కంటెంట్ తో వెకిలి చేష్టలతో నింపేసిన టైం లో ఇలా నెగ్గుకురావడం కష్టమే అయినా ఒక సంవత్సరం లోనే ఆ ఫీట్ సాధించింది నవల్ కిశోరీ. తన పోస్టులకు ఫ్యాన్స్.. విమర్శకుల పెట్టిన కామెంట్ లకు రిప్లయి ఇస్తూ ఫాలోవర్స్ అటెన్షన్ తనపై వుండేలాచూసుకునే ఈమె ఇటీవల తనని అనుకరిస్తూ రీల్స్ చేసేవారిని కూడా ఎంకరేజ్ చేస్తూ కామెంట్స్ పెట్టడం విశేషం… అయితే కొన్ని ఇమిటేషన్స్ హద్దు మీరడం విచారకరం.. ఏది ఏమైనా పద్ధతి గా పాపులర్ అవ్వొచ్చు అని చెప్పిన నవల్ కిషోరీ కి హ్యాట్సాఫ్ చెపుదాం..