దువ్వాడ విషయం లో నట్టి కుమార్ వ్యాఖ్య
“దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ విషయంలో మాధురి మాటలు నీచం. ఈ వ్యవహారంలో వారికి జగన్ సపోర్ట్ చెస్తారెమో.
మాధురి సుప్రీం కోర్టు తీర్పు, అంటూ రిలేషన్ గురించి ఎదో మాట్లాడింది. కానీ భార్య పిల్లలు ఉండగా… విడాకులు ఇవ్వకుండా కుటుంబసభ్యులను ఇబ్బంది పెట్టేలా రిలేషన్ లో ఉండమని సుప్రీం కోర్టు చెప్పలేదు.. అవంతి, అంబటి లాంటి వారు చేసిన వ్యవహారాలు చూశాం..ఇప్పుడు దువ్వాడను పార్టీ నుంచి జగన్ సస్సెండ్ చెస్తారా? లేదా?. .. అని సీనియర్ సినీ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ,
పవన్ కల్యాణ్ ను విమర్శించే అర్హత వైసీపీ నాయకులకు లేనే లేదని మహిళలకు అన్యాయం చేస్తున్న వైసీపీ నాయకుల సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి వారిపై ఎలాంటి చర్య తీసుకోకపోవడం ఆయన నైజాన్ని తెలియజేస్తుంది. పొద్దున లేచినప్పట్నుంచి ఓర్వలేక పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్ళు చేసుకున్నారంటూ విమర్శించిన జగన్మోహన్ రెడ్డి అండ్ కో గత కొద్ది రోజులుగా వాళ్ళ పార్టీ నాయకుల రాసలీలలు ఒక్కొక్కటి బయటకు వస్తుండటంతో ఏం సమాధానం చెబుతారో తేలాలి. వాస్తవానికి పవన్ కల్యాణ్ పెళ్ళిళ్ల విషయంలో ఎలాంటి గొడవలు లేవు. విడాకులు ఇచ్చిన తర్వాతే ఆయన పెళ్ళిళ్లు చేసుకున్నారు. పవన్ ముక్కుసూటి మనిషి. ప్రజలకు మంచి చేయాలని రాజకీయాలలోకి వచ్చారు. అలాంటి వ్యక్తి మీద ఏదో రకంగా బురద చల్లాలని జగన్, ఆయన పార్టీ నాయకులు చూశారు. కానీ ఇప్పుడు దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ లో ఏర్పడిన వివాదంపై జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి. అలాగే లోగడ పలువురు వైసీపీ నాయకులపై వచ్చిన మహిళల వివాదాలలో జగన్ ఎలాంటి చర్యలు వారిపై తీసుకోలేదు” అని అన్నారు.
అవసరానికి వాడుకుని వదిలేసే రకం జగన్. ఇప్పుడు జగన్ అతని అనుచరలు అలాగే చేస్తున్నారు..
విశాఖలో ఎంఎల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. బొత్స సత్యనారాయణ వద్ద అక్రమ సంపద ఉన్నది కాబట్టి జగన్ సీటు ఇచ్చారు. విశాఖ కు అభివృద్ధి కావాలి.. అరాచకం వద్దు.. అందుకే కూటమి అభ్యర్థి ఈ ఎన్నికలలో గెలుస్తారు. దాదాపు 830 ఓట్లలో అత్యధిక ఓట్లు కూటమికి రావడం ఖాయం. విశాఖ ఎంఎల్సీ సీటు టీడీపీ తరపున పీలా గోవింద్ కి ఇస్తే బాగుంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం.. కానీ చంద్రబాబు గారు ఎవరికి సీట్ ఇచ్చినా గెలుస్తారు..
ఇటీవల పవన్ కల్యాణ్ అడవి గురించి మాట్లాదుతూ ఒకప్పటి హీరోల సినిమాల గురించి ప్రస్తావిస్తూ… , ఇప్పటి వాళ్ళు అలాంటి సినిమాలు చేయాలని అటవీ శాఖ మంత్రిగా మాట్లాడారు తప్ప ఆయన అల్లు అర్జున్ గురించి విమర్శలు చేయలేదన్నది సుస్పష్టం. కొందరు కావాలని దీనిని చిలవలు పలవలు చేస్తున్నారు.
ఏపీ ఎఫ్.డి.సి. చైర్మన్ పదవిని నేను ఆశిస్తున్నాను. నాకున్న అనుభవంతో సినీ పరిశ్రమ అభివృద్ధి కి కృషి చేయాలనేది నా అభిమతం..
చంద్రబాబు గారి ఆధ్వర్యంలో సేవ చేసే అవకాశం ఇస్తే బాగుంటుందని నా ఆకాంక్ష. ఈ విషయాన్ని చిరంజీవి ,బాలయ్య బాబు, పవన్ కళ్యాణ్, లోకెష్ గార్లను అడుగుతున్నాను.. ఒకవేళ కానీ నాకు పదవి రాకున్నా.. లోకేష్ బాబు వెంటే ఉంటాను..ఎఫ్ డి సి పదవి అర్హత, అవగాహన ఉన్న వారికే ఇవ్వాలని నా మనవి. గతంలో అంబికా కృష్ణ, పోసాని వల్ల ఒరిగింది ఏమి లేదు..చంద్రబాబు గారిని ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ విషయంలో కె .ఎ స్ .రామారావు మోసం చేశారు. అందువల్లే అలాంటి వారికి ఇవ్వొద్దు. ఇక చిత్ర పురి లో సినిమా వాళ్లకు తక్కువ ఇళ్ళు బయట వారికి ఎక్కువ ఇళ్లు ఉన్నాయి. ఏపీలో కూడా చిత్రపురి అంటూ ప్రయత్నాలు చేస్తున్నారు. చిత్రపురి సొసైటీ లాండ్ ను తాకట్టు పెట్టకూడదు.. అది క్రైమ్..అయితే చదలవాడ తాకట్టు పెట్టుకున్నారు..
అది కార్మికుల సొత్తు.. దీనిపై తెలంగాణా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోవాలి.. బాలయ్య బాబు నటుడిగా 50 సంవత్సరాల వేడుక చేస్తున్నారు..కానీ అందరికీ సమాచారం ఉండాలి.. అందరినీ కలుపుకుని వెళితే బాగుంటుంది. చిరంజీవి గారు ,పవన్ గారు, జూనియర్ ఎన్టీఆర్ అందరూ రావాలి” అని చెప్పుకొచ్చారు.