గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రయోగాత్మకంగా చేపట్టిన యూ టర్న్ ట్రాఫిక్ విధానానికి జనాలు ఆల్మోస్ట్ అలవాటు పడినప్పటికీ అసలు సిగ్నల్ జంక్షన్స్ లేని పద్ధతిని హైదరాబాదీయులు వ్యతిరేకిస్తున్నారు.. ఈస్ట్, వెస్ట్, సౌత్, నార్త్ అన్న తేడాలు లేకుండా అన్ని జంక్షన్లను డైవర్ట్ చెయ్యడమో లేక క్లోజ్ చేయడమో చేసేసారు.. దీనిపై భిన్న స్వరాలు వినిపిస్తున్నప్పటికి ఎక్కువ శాతం వ్యతిరేకతే మూట కట్టుకుంది..
గతం లో పీక్ అవర్స్ లో మాత్రమే ట్రాఫిక్ వుండేది కొన్ని ప్రాంతాలలో మార్నింగ్ మరి కొన్ని ప్రాంతాలలో ఈవినింగ్ ఎక్కువ ట్రాఫిక్ వుండేది.. స్కూల్ బస్సులు, వెహికల్స్ వలన సమస్య మరింత జఠిలం అవుతుందని గ్రహించిన ప్రభుత్వం స్కూల్ వేళల్లో మార్పులు చేసినప్పటికి ట్రాఫిక్ పరిస్థితి లో మార్పు మాత్రం లేదు.. ఎన్నో మార్పులు చేర్పుల తరువాత ట్రాఫిక్‌ను మరింత ఈజీ చేయడానికి ప్రయోగాత్మకంగా చేపట్టిన యూ టర్న్స్ అధిక ఇంధన వినియోగం, లాంగ్ ట్రావెల్ కి కారణమవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి. ఇది సమస్యను మరింత పెంచుతుందే తప్పా తగ్గించదని, ఈ తరహా లాంగ్ యూ టర్న్ ల కారణంగా రాంగ్ రూట్ ప్రయాణాన్ని ఎంచుకోవాల్సి వస్తుందని మరికొంత మంది అంటున్నారు.. ఐకీయ, స్కై వ్యూ బిల్డింగ్, బేగంపేట్ షేక్‌పేట్ , ఫిల్మ్ నగర్ , ఇలా ఒకటీ రెండు కాదు ఆల్మోస్ట్ అన్ని జంక్షన్లు మూసుకుపోయాయి. కొన్ని కొన్ని యూ టర్న్ లు తీసుకోవాలంటే దాదాపు కిలోమీటరు మేర ప్రయాణించాల్సి వుంటుందని సమయం పెట్రోల్ రెండూ వృదా అవుతున్నాయని దగ్గరలో చాల ఓపెన్ డివైడర్ లు వున్నప్పటికీ లాంగ్ యూ టర్న్ లకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారో అర్థం అవ్వడం లేదని ఓ ప్రయాణికుడు వాపోయాడు.. ఇన్ని యు-టర్న్‌లు వున్న సిటీ బహుశా మరేదీ ఉండదేమో.. హైదరాబాద్ ను యూ టర్న్ సిటీ అని ముద్దుగా పిలుచుకోవచ్చు అని మరికొందరు అంటున్నారు.. అయితే ప్రతి సిగ్నల్‌ను చూసుకునేంత సిబ్బంది తమ వద్ద లేరని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. అలాంటప్పుడు, వారు సిగ్నల్స్ ను పునరుద్ధరించి స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలను, వాలంటీర్లను ఇందులో భాగం చేస్తే కొంతమేర సత్ఫలితాలు రావచ్చని రోడ్డు భద్రతా నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.. ఐటీ హబ్‌లోని ప్రాంతాలు రాయదుర్గ్ మెట్రో స్టేషన్ డల్లాస్ సెంటర్ స్కై వ్యూ బిల్డింగ్ వైపు వెళ్లాలనుకుంటే, యూటర్న్ తీసుకోవడానికి హైటెక్ టెక్ సిటీ ఫ్లైఓవర్ ఎండ్‌కు వెళ్లాలి. ఇది దాదాపు ఒక కిలోమీటరు. షేక్‌పేట్ ఫ్లైఓవర్ కింద యూ టర్న్ ది కూడా ఇదే పరిస్థితి.. కొంతమంది కిలోమీటరు వెళ్లి కిలోమీటరు రావడానికి ఇష్టపడని వాళ్ళు రూల్స్నీ అతిక్రమించి రాంగ్ సైడ్ డ్రైవింగ్ లో వెళ్లి పోతున్నారు ఈ రాంగ్ సైడ్ డ్రైవింగ్ కేవలం ద్విచక్ర వాహనాలకే పరిమితం కాకుండా ఆటోలు, టెంపోలు ఇతర ఫోర్ వీలర్స్ వాళ్ళు కూడా ఈ పద్ధతి నే అనుసరిస్తున్నారు.. మరి కొంత మంది ప్రయాణ దూరాన్ని తగ్గించడానికి, సమీపంలోని కాలనీలు, చిన్న చిన్న గల్లీలు, షార్ట్ కట్ మార్గాలుగా ఉపయోగించడం తో ఆ మార్గాలు కూడా నిత్యం ట్రాఫిక్ తో దర్శనమిస్తున్నాయి.. ఇలాంటి రోడ్లు ఇరుకైనవిగా వుండటం అలాంటి మార్గాలలో కూడా ట్రాఫిక్ పోలీసులు డివైడర్ లు ఏర్పాటు చేసారు.. దీని వల్ల రోడ్డు ఇరుకుగా మారడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే వీధులు చాలనే వున్నాయి.
బేగంపేట్ జంక్షన్ వద్ద, ఈ బారికేడ్లు ఒక లేన్ మొత్తాన్ని ఆక్రమించాయి. ఫ్లైఓవర్ ఉన్నప్పటికీ, చాలా మంది వాహనదారులు ఈ మార్గంలో వెళ్లడానికి ఇష్టపడతారు, వాహనాలు యు-టర్న్‌లు తీసుకోవడంతో రద్దీ రహదారిగా మారుతోంది.
యు-టర్న్ తీసుకునేటప్పుడు, నాలుగు చక్రాల వాహనాలు కనీసం ఒకటి నుండి రెండు లేన్‌లను స్వాధీనం చేసుకుంటాయి. చాలా ప్రధాన రహదారులు మూడు లేదా నాలుగు లేన్‌లను కలిగి ఉన్నప్పుడు, యూ టర్న్‌లు తీసుకునేవారు దానిలో సగభాగాన్ని ఆక్రమించడం తో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నిజానికీ కొన్ని చోట్ల సిగ్నల్ ఫ్రీ చెయ్యడం కోసం జంక్షన్ లను క్లోజ్ చెయ్యాల్సిన అవసరం వుంది.. హబ్సిగూడ జంక్షన్,అలాగే అదే రోడ్ లోని ఉప్పల్ కి ముందు వచ్చే సిగ్నల్ కూడా జంక్షన్ క్లోజ్ చేసి యూ టర్న్ కి అవకాశం ఇవ్వొచ్చు.. స్ట్రెయిట్ గా వెళ్ళే వాహనాలు ఎక్కువగా వుండడం వలన ఇది అత్యవసరం కానీ ఇలాంటి చాలానే వున్నాయి..
ఇలాంటి అర్థం లేని సిగ్నల్స్ కోసం ఉపయోగం లేని యూ టర్న్ ల కోసమో టైం ని గాని పెట్రోల్ ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని మరో హైదరాబాదీ ప్రశ్నించాడు.. కొంత మోధం కొంత ఖేదం లా ఈ ట్రాఫిక్ ప్రయోగం నిలిచిపోయింది.. అయితే దీనిపై మరింత అధ్యయనం చేసి పునః నిర్ణయం తీసుకుంటే పరిస్థితి మెరుగయ్యే అవకాశం కచ్చితం గా వుంది.