బాలీవుడ్ లో ఇటీవల సక్సెస్ అయి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ లో సూపర్ హిట్ అయిన శ్రీకాంత్ సినీమా గురించి ఇప్పుడు దేశం చర్చించుకుంటుంది. తెలుగు వ్యక్తి అయిన శ్రీకాంత్ లైఫ్ పై బాలీవుడ్ ఎందుకు ఆసక్తి చూపించింది.. హిందీ వాళ్ళు దృష్టి పెట్టిన ఆయన జీవితాన్ని టాలీవుడ్ మేకర్స్ ఎందుకు విస్మరించారు.. కనీసం తెలుగు మీడియా రివ్యూ కి కూడా నోచుకోని ఈ చిత్రం ఇప్పుడెందుకు అందరి దృష్టి ని తెలిపిస్తోంది.. దృష్టి లోపం వున్న వ్యక్తి జీవితాన్ని దర్శకుడు తుషార్ హీరానందాని ఎందుకు తెరకెక్కించాడు.. ఇంతకీ ఎవరీ శ్రీకాంత్
మచిలీపట్నం లోని సీతారామపురం అనే పల్లెటూరి లో సాధారణ రైతుకుటుంబంలో బొల్లా శ్రీకాంత్ పుట్టినపుడు తల్లితండ్రులు ఆనందపడక పొగా చాలా విచారించారు. కారణం ఏంటంటే.. ఆ బిడ్డ కళ్ళు లేకుండా వూపిరి పోసుకున్నాడు.. గ్రామస్తులు ఆ పడిగుడ్డును ఎలా వదిలించుకోవాలో సలహాలు ఇచ్చి వెళ్లారు.. తండ్రి మనసు పరి పరి విధాల ఆలోచించించినా తల్లి ప్రేమ అందుకు ఒప్పుకోలేదు.. బతికున్నంతవరకు బాగా చూసుకొంటాం. పోయాక దేవుడే చూసుకోవాలి ” అని పెంచేందుకు సిద్ధ పడ్డారు.
కళ్ళు లేవన్న మాటే కానీ చదువు లో మంచి ప్రతిభ చూపించేవాడు. ఇంటర్ లో కళాశాలల మేనేజ్మెంట్ అంధత్వాన్ని కారణం చూపించి సీటు నిరాకరిస్తే చట్టపరంగా గెలిచి సీటు సాధించినప్పటికీ తోటి పిల్లల వేధింపులు రెండు సంవత్సరాల విద్యని దూరం చేసాయి. ఆ తరువాత హైదరాబాద్ లో స్కూల్ ఫర్ ది ఎ స్పెషల్లీ ఎబ్ల్డ్ లో చేరితే అక్కడ కూడా కొంత మంది పిల్లలు అవమానించారు. ఒక సందర్భంలో టీచర్ కొట్టిన చెంపదెబ్బ పట్టుకొని లైఫ్ లో మలుపు తిప్పిన ఘటన అయింది ఆ టీచర్ ఆడియో టేపుల్లో వినిపించిన లెసన్స్ కారణంగానే . ఇంటర్ ఏం పీ సీ (MPC) లో 98% సాధిస్తే వెక్కిరించి నోళ్ళు మూత పడ్డాయి..
మళ్ళీ ఇంటర్ లో చేరడానికి ఎదురైనా అవాంతరాలు మళ్ళీ ఎదురైంది ఐఐటి (IIT) లో సీటు ఇచ్చేందుకు నిరాకరిస్తే అమెరికా యూనివర్సిటీ ల ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే స్టాన్ఫోర్డ్ (Stanford) యూనివర్శిటీ తో పాటు మరో రెండు యూనివర్సిటీ లు ముందుకొచ్చాయి. హోవర్డ్ మాసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (Howard Massachusetts Institute of Technology) బ్రెయిన్ కాగ్నిటివ్ సైన్స్స్ (Brain Cognitive Sciences) లో చేరిన తొలి అంధుడిగా రికార్డు సాధించడం కాకుండా అద్భుత ప్రతిభ చూపించాడు.
శ్రీకాంత్ టాలెంట్ చూసిన నాలుగు అమెరికన్ కంపెనీ లు జాబ్ ఆఫర్ లు ఇస్తే నో చెప్పి
ఇండియా వచ్చి హైదరాబాద్ దగ్గర బొల్లంట్ ఇండస్ట్రీస్ (Bollant Industries) స్థాపించాలన్న ప్రతిపాదన తీసుకువస్తే రతన్ టాటా ముందుకొచ్చి నిధులు సమకూర్చారు. శ్రీకాంత్ సీఈఓ గా వ్యవహరిస్తున్న ఈ కంపెనీ 150 కోట్ల టర్నోవర్ తో నడుస్తోంది అప్పటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం తో కలసి లీడ్ ఇండియా ప్రాజెక్ట్స్ (Lead India Project) ద్వారా నాలుగు లక్షలమంది విద్యార్థులు ట్రెయిన్ అయ్యారు.
శ్రీకాంత్ నిర్వహిస్తున్న కంపెనీ లో దాదాపు 300 మంది దివ్యాంగులు ఉపాది పొందుతున్నారు. మూడు వేలమంది విద్యార్థులను చదివిస్తు శ్రీకాంత్ బొల్లా చరిత్ర సృష్టించిన శ్రీకాంత్ 2022లో తన ప్రేమికురాలు స్వాతిని వివాహం చేసుకున్నారు విధి రాసిన రాత ఒకలా వున్నా తన రాత ను తానే దిద్దుకున్న శ్రీకాంత్ ఎందరికో ఆదర్శం.
శ్రీకాంత్ జీవితం దగ్గరిగా గమనిస్తే అన్నమయ్య కన్నా ముందే నాలుగు లక్షల వచన పదకవిత లను రాసి సింహాచల వరాహ నరసింహస్వామి కి అర్పించిన కాంతా కృష్ణమాచార్యుల లైఫ్ కి దగ్గరగా కనిపిస్తుంది.. పుట్టు అంధుడైన కాంతా కృష్ణమాచార్యులను కూడా ఓ బావి లో పడేసి తల్లి తండ్రులు ఒదిలేసుకోవాలనుకుంటే దైవం ఆయన్నో మహాకవి ని చేసింది.. అలాగే బోల్లా శ్రీకాంత్ జీవితం కూడా భారతావని కి ఒక పాఠ్యాంశం అయింది.. బాలీవుడ్ కి క్రియేటివ్ కంటెంటే కాదు ఇన్స్పిరేషనల్ మెటీరియల్ అయింది. హ్యాట్సాఫ్ శ్రీకాంత్ సర్..