స్లేట్ పెన్సిల్ స్టోరీస్ బ్యానర్ పై ప్రభాకర్ ఆరిపాక సమర్పణ లో పృధ్వీ పొలవరపు నిర్మాత గా ప్రముఖ నటుడు సముద్ర ఖని ముఖ్య పాత్రలో కమెడియన్ ధన్ రాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న రామం రాఘవం చిత్రం తెలుగు వెర్షన్ సెన్సార్ పూర్తి చేసుకున్నట్లు మేకర్స్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు.. బలగం సూపర్ డూపర్ హిట్ అవ్వడం తో మరో కమెడియన్ దర్శకత్వం వహిస్తుండడం తో ఈ సినీమా పై అంచనాలు ఎక్కువగా వున్నాయి.. తండ్రి కొడుకుల మధ్య ఒక ఎమోషనల్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం నుండి వచ్చిన ఫస్ట్ లుక్ దగ్గరనుండి రిలీజైన గ్లింప్స్ , టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది..తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు వారు ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. సముద్ర ఖని ఇంటేన్షల్ లుక్ తో వున్న పోస్టర్ పై ఒక వెలుగులా u/a లెటర్స్ తో ఫాధర్ అండ్ సన్ సెలౌటీ షాట్ ఇంట్రస్టింగ్ గా వుంది..ధన్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హరీష్ ఉత్తమన్, సునీల్ , సత్య, మోక్ష సేన్ గుప్తా, ప్రమోదిని, శ్రీనివాస రెడ్డి, పృథ్వీ రాజ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అరుణ్ చిలువేరు సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి దుర్గాప్రసాద్ కొల్లి సినిమాటోగ్రాఫర్ కాగా మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్. ఆగస్ట్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
previous post