‘పుష్ప-2’ దిరూల్ విషయంలో కథానాయకుడు అల్లు అర్జున్- దర్శకుడు సుకుమార్‌పై సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్‌పై అల్లు అర్జున్ సన్నిహితుడు, ప్రముఖ నిర్మాత బన్నీవాస్ స్పందించారు. ఈ ‘పుష్ప-2 గురించి మీడియా లో వస్తున్న న్యూస్ లు చూసి నవ్వుకునే స్థితిలో మేమున్నాం. అల్లు అర్జున్ షూటింగ్ పార్ట్ 15 నుంచి 20రోజుల లోపు ఉంది. ఇది కాకుండా వేరే ఆర్టిస్టులతో కూడా చిత్రీకరణ మిగిలి వుంది. దర్శకుడు సుకుమార్ ఎడిటింగ్ చూసుకుని ఇంకా ఏమైనా అల్లు అర్జున్ పార్ట్ బ్యాలెన్స్ వుందేమో క్లారిటీ తెచ్చుకుని షూటింగ్ పెట్టుకుందాం అన్నారు. అల్లు అర్జున్ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ట్రీమ్ చేశారు. అల్లు అర్జున్ సుకుమార్‌కు నాకు ఉన్న బాండింగ్ లైఫ్ లాంగ్ అలానే వుంటుంది. ఆగష్టు మొదటి వారంలో షూటింగ్ మొదలవుతుంది పుష్ప లాంటి పాన్ ఇండియా క్రేజీ ఫిలిం ని సింపుల్ గా ఎందుకు తీసుకుంటారు’ అని అన్నారు.
ఫ్యామిలీ అంతా కలిసే వుండాలని కోరుకుంటారు
ఫ్యామిలీలో కొన్ని సిట్యుయేషన్స్ వస్తాయి.. మోర్ దెన్‌ఎనీ థింగ్ వాళ్ల మధ్య వున్న రిలేషన్స్ కానీ, వాళ్ల ఫ్యామిలీలు కలిసే సిట్యుయేషన్స్ కానీ నేను20 ఏళ్లుగా చూస్తూనే వున్నా. చిరంజీవి గారు ఎప్పుడూ కూడా ఫ్యామిలీ అంతా కలిసి వుండాలని కోరుకుంటారు. అంతేకాదు ప్రతి సంవత్సరం ఫ్యామిలీ అందరిని సంక్రాంతికి బెంగళూరుకు తీసుకెళతారు.కుదిరిన ప్రతి ఒక్కరు అక్కడికి వెళతారు. దానిని ఆయన ఓ సెలబ్రేషన్‌లా చేస్తాడు. దానికి కారణం ఫ్యామిలీ అంతా కలిసి వుండాలి అని ఆయన కోరుకోవడం. పిల్లలు ఎదిగినా..ఎవరి ట్రాక్‌లో వాళ్లు వున్నా ఫ్యామిలీ అంతా కలిసి వున్నాం.. మేమంతా ఒక్కటే అనే మేసేజ్ బయటికి పంపిస్తుంటారు. వాళ్ల వాళ్ల వ్యక్తిగత నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఫ్యామిలీలో కొన్ని కొన్ని పరిస్థితులు వస్తాయి. ఫ్యామిలీ అంతా ఆ సిట్యుయేషన్స్‌ను ఫేస్ చేయాల్సి వస్తుంది.అంతా మాత్రాన ఇప్పుడున్న తాత్కాలిక ఎమోషన్స్‌ను బేస్ చేసుకుని మెగా ఫ్యామిలీకి ప్రజెంట్ సిట్యుయేషన్‌తో లింక్ చేయడం తెలివైన నిర్ణయం కాదని నా అభిప్రాయం. ఎందుకంటే వాళ్ల బాండింగ్ నాకు తెలుసు. వాళ్లు వాళ్లలో ఒక్కరికి ఏదైనా సిట్యుయేషన్ వచ్చినా ఎలా వుంటారో తెలుసు. ఒకే ఒక్క సిట్యుయేషన్ చాలు ఇప్పుడున్న అన్ని రూమర్స్ చెక్ పెట్టడానికి… నేను కూడా దాని గురించే వెయిటింగ్. మేము అందరం కోరుకునేది ఒక్కటే. ఆ కుటుంబం బాగుండాలని.. బాగుంటుంది కూడా. ఇలాంటి రూమర్స్…ఇవన్నీ పాసింగ్ క్లౌడ్స్” ఓ జర్నలిస్టు అడిగిన ఓ ప్రశ్నకు బన్నీవాస్ సమాధానం చెప్పారు..