కీలక పోల్స్‌లో రెండు సీట్లకే పరిమితమైన బిజేపి
కేంద్రంలో రికార్డు స్థాయిలో మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ, ప్రస్తుతం జరిగిన ఏడు రాష్ట్రాలు ఉపఎన్నికల్లో 13 స్థానాలకు గాను బిజేపి కేవలం రెండు స్థానాలను మాత్రమే గెలుచుకోగలిగింది.. లోక్సభ ఎన్నికలలో నాలుగు వందల స్థానాలు గెలుచుకుని అధికారం లోకి వస్తామని ప్రచారం చేసుకున్న ఎన్డీయే కూటమికి ఇండియా కూటమి గట్టిపోటీ నిచ్చి 293సీట్లకు పరిమితం చేసింది . ఎన్డీయే లో చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ లు కీలకం గా మారారు.. స్వంతం గా బిజేపి అధికారం లోకి వస్తే రిజర్వేషన్ల వంటి వాటిపై నిర్ణయం తీసుకునే అవకాశం వుంటుందని అంతా అనుకున్నారు..
కేంద్రం లో అధికారం లోకి వచ్చినా బిజేపి ప్రాభవం తగ్గుతుందని చెప్పడానికి తాజా ఎన్నికలు ఉదాహరణ గా నిలుస్తున్నాయి..
ఏడు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగిన 13 సీట్లలో ఆప్ ఇండియా కూటమి 10 స్థానాలను గెలుచుకుంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకోవడం తో ఇప్పుడునా పార్టీ లో చర్చ మొదలైంది.
పంజాబ్‌లోని జలంధర్ పశ్చిమ నియోజకవర్గంలో ఆప్‌కి చెందిన మొహిందర్ భగత్ 23,000 ఓట్లకు పైగా ఆధిక్యంతో విజయం సాధించగా పశ్చిమ బెంగాల్‌లో పోటీ చేసిన నాలుగు స్థానాలనూ కైవసం చేసుకోవడం ద్వారా టిఎంసి తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. అలాగే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు భార్య కమలేష్ ఠాకూర్ డెహ్రా నియోజకవర్గంలో విజయం సాధించడంతో ఆ పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.. నలగర్ సీటును కాంగ్రెస్ నిలుపుకోగా, హమీర్‌పూర్‌లో బిజెపి విజయం సాధించగలిగింది. “ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కుట్రలు” పన్నుతున్న వారికి హిమాచల్ ప్రదేశ్ ప్రజలు తగిన సమాధానం చెప్పారని విజయం తర్వాత ముఖ్యమంత్రి సుఖూ వ్యాఖ్యానించారు.. ఇది రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉన్నారన్న సందేశం ఇచ్చారని ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేసీ కారణం లేని ఎన్నికలు తీసుకొచ్చి గుణపాఠం నేర్చుకున్నారని చెప్పారు..అదే విధంగా తమిళనాడులోని విక్రవాండి అసెంబ్లీ స్థానం నుంచి డీఎంకే అభ్యర్థి అన్నియూర్ శివ దాదాపు 60,000 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉత్తరాఖండ్‌లోని రెండు స్థానాలను కాంగ్రెస్ గెలుచుకోగా, మధ్యప్రదేశ్‌లోని అమర్వార్ స్థానాన్ని బీజేపీకి చెందిన కమలేష్ ప్రతాప్ షాహి గెలుచుకున్నారు. బీహార్‌లోని పుర్నియాలో రూపాలీ అసెంబ్లీ ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థి శంకర్ సింగ్ 8,246 ఓట్ల తేడాతో జేడీయూకి చెందిన కళాధర్ ప్రసాద్ మండల్‌పై విజయం సాధించారు. 2024 లోక్‌సభ ఎన్నికల జరిగిన తర్వాత జరిగిన ఎన్నికల్లో బిజేపి పేలవ ప్రదర్శన ఇన్డీ కూటమి కి మరింత బలాన్నిచ్చింది.. అయితే బిజేపి నేతలు దీన్ని కొట్టి పారేస్తున్నారు.. స్థానిక నేపథ్యాల ప్రామాణికంగా జరిగే ఈ ఎన్నికలకు అంతా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదని ఈ ఫలితాలు కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ప్రభావాన్ని చూపించవని చెప్తున్నారు.. బిజేపి ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా అప్రమత్తం కావల్సిన అవసరం ఎంతైనా వుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు