వైవాహిక జీవితంలో ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ వృద్ధాప్యంలో కూడా కష్టాలను సమపాళ్ళలో పంచుకున్న నాడే ఆ జంట జన్మకు పరిపూర్ణత లభిస్తుంది. అలా కాదని ఏ ఒక్క భాగస్వామి అయిన స్వార్థపూరిత ఆలోచనలతో వుంటే మిగిలిన వారి జీవితం అగమ్యగోచరం. గా మారిపోతుంది.. జీవిత చరమాంకంలో ఇదో అతి పెద్ద విఘాతమై దారి తెలియని స్థితి లోకి నెట్టేస్తుంది అలాంటి పరిస్థితి కి ఈ పెద్దాయన జీవితమే నిదర్శనం. విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో నివసించే ఓ వృద్ధుడి నుంచి గత మూడు సంవత్సరాల క్రితం తన భార్య ఆస్తులన్నీ తీసుకుని ఆయన్ని వీధిపాలు చేసింది. ఆత్మగౌరవం ఉన్న వ్యక్తిగా ఆకలినైనా భరించిన ఆ వ్యక్తి తన బాధను ఎవరికీ తెలియపరచలేదు. ఆస్తులను కాజేసి వృద్ధాప్యంలో ఉన్న భర్తను బయటికి పంపించిన భార్యామణి పై ఆవేదన వ్యక్తం చేస్తున్న ఆ వృద్ధుడ్ని స్థానికులు మూడేళ్ల నుంచి స్థానికులు ఆయన పోషణ భారాన్ని తీసుకున్నారు.. 80 సంవత్సరాల ఈ వృద్ధుడి ప్రభుత్వం నుంచి పెన్షన్ రాకపోవడం తో కొంత మంది స్థానికులు. అధికారులు ప్రజా ప్రతినిధుల దృష్టి కి తీసుకువెళ్ళారు. ఈ పెద్దాయన కు పెన్షన్ ఇచ్చి తగు న్యాయం చేయాలి అంటూ ఎమ్మెల్యే గణబాబుకు విజ్ఞప్తి చేశారు.
previous post