అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా చేస్తున్న కొన్ని ప్రకటనలు ప్రపంచాన్ని భయానికి గురి చేస్తున్నాయి.నాసా ఏ ప్రకటన చేసిన అది భూమి అంతానికి మానవ వినాశనానికి సంబంధించిందే అయి ఉంటుందన్న భయం ప్రపంచ దేశాల్లో నెలకొంది. అందుకు అనుగుణంగానే ఇటీవల నాసా చేసిన ఒక ప్రకటన అందరిని భయందోళనకు గురిచేసింది. ఇదేమి కొత్త కాదు కదా నాసా ప్రకటనలు అందర్నీ భయానికి గురించి చేయడం ఎప్పుడూ ఉండేదే కదా అని అందరూ అనుకోవడం సర్వసాధారణమైపోయింది. ఎంత అవునన్నా కాదన్నప్పటికీ కాస్త భయం అయితే ఉండిపోయింది.నాసా తాజాగా చేసిన ప్రకటన సారాంశం ఏంటంటే 2046 ఫిబ్ర వరి 14న సాయంత్రం 4.44 గంటల (ఈస్టర్న్ టైం)కు ‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం భూమిని ఢీకొనవచ్చని పేర్కొంది.భారత కాలమానం ప్రకారం ఫిబ్రవరి 15న తెల్లవారుజామున 3.14 గంటలకుఈ ప్రమాదం జరగొచ్చని ఓ అంచనా. ఇటలీలోని పీసా టవర్(186 అడుగులు)కు కాస్త దగ్గరగా 165 అడుగుల పరిమాణంలో ఈ గ్రహ శకలం ఉందని నాసా ప్రకటించింది. ఇప్పుడు ఈ ప్రకటనే అందరిని భయానికి లోను చేస్తుంది.అమెరికా నుంచి భారత్ దాకా‘2023డీడబ్ల్యూ’ గ్రహశకలం హిందూ మహా సముద్రం నుంచి పసిఫిక్ మహాసముద్రం దాకా ఎక్కడైనా పడొచ్చని నాసా అంచనా వేసింది.అమెరికాలోని హవాయి, లాస్ ఏంజిలిస్, వాషింగ్టన్ వంటి నగరాలూ ఈ మార్గంలో ఉన్నాయని పేర్కొంది. నాసా అంచనా వేసిన మ్యాప్ ప్రకారం తర్వాతి స్థానాల్లో ఇండోనేసియా, ఫిలిప్పీన్స్,థాయ్‌లాండ్ ,ఇండియా, గల్ఫ్ దేశాలు కూడా ఉన్నాయి. అయితే వీటికి ప్రమాదం తక్కువేనని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా హెచ్చరించింది. తొలుత 1,200 చాన్సుల్లో ఒకసారి అది ఢీకొట్టవచ్చని భావించారు. నిశితంగా పరిశీలించాక 710 చాన్సుల్లో ఒకసారికి, తర్వాత 560 చాన్సుల్లో ఒకసారికి మార్చారు. అంటే ప్రమాద అవకాశం మరింత పెరుగుతోందన్న మాట.2023డీడబ్ల్యూ’ గ్రహశకలాన్ని కొన్నివారాల క్రితమే గుర్తించారు. దాని ప్రయాణమార్గం, వేగం, ఇతర అంశాలను పరిశీలించిన ఓ ఇటాలియన్ ఆస్ట్రానమర్ భూమిని ఢీకొట్టే అవకాశం ఉందని నాసాను అలర్ట్ చేశారు.దీంతో నాసా తాజాగా ఈ ప్రకటన చేసింది.