Vaisaakhi – Pakka Infotainment

2030 నాటికి స్మార్ట్ ఫోన్ల స్థానం లో శరీరం , మెదడుతో నియంత్రించగలిగే కొత్త గాడ్జేట్స్…

6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే..ప్రస్తుతం మనం చూస్తున్న, వాడుకలో ఉన్న స్మార్ట్ ఫోన్ కూడా మాయం అవుతుందని ప్రముఖ టెక్ దిగ్గజం నోకియా సంస్థ సీఈఓ పెక్క లుండ్‌మార్క్ అంటున్నారు. 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తే సాంకేతికతను మనం చూసే దృక్కోణం కూడా మారుతుందని ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ప్యానెల్ సభ్యుడిగా పాల్గొన్న ఆయన 6జీ సాంకేతికత గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. శరీరం – మెదడుతో నియంత్రించ గలిగే కొత్త పరికరాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయనేది ఇప్పుడు జోరుగా ప్రచారం జరుగుతోంది. అదిఎంతో దూరం లో లేదని 2030 నాటికే సాధ్యమవుతుందని స్పష్టం చేస్తున్నారు. అదెలా సాధ్యమవుతుంది. అటువంటి అవకాశం ఎంత వరకు ఉందన్న చర్చ ఇప్పుడు మొదలయింది. మానవ శరీరంలోని నాడుల స్పందన ఆధారంగా పనిచేసే న్యూరాలింక్ వంటి పరిజ్ఞానం అతి త్వరలోనే అందుబాటులోకి రానుంది.అయితే 6జీ సాంకేతికత ఉంటేనే అటువంటి పరికరాలు వేగంగా పనిచేయగలవని సైంటిస్ట్ లు కూడా చెబుతున్నారు. అయితే ఒక్కసారి ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా మారిపోతున్న సాంకేతికతతో మొబైల్ ఫోన్స్, నెట్‌వర్క్ పరిజ్ఞానం ముందంజలో ఉంది. ప్రస్తుతం 4జీగా ఉన్న సెల్‌ఫోన్ నెట్‌వర్క్ మరో ఏడాదిలోగానే పూర్తి స్థాయిలో 5జీగా మారనుంది. ఇప్పటికే కొన్ని దేశాల్లో ఎన్‌హన్సడ్ 5జీ నెట్ వర్క్ అందుబాటులో ఉంది. 5జీ సాంకేతికత అందుబాటులోకి రావడంతోనే..ఇంటర్నెట్ వస్తుసేవల్లోనూ పెను మార్పులు చోటుచేసుకోనున్నాయి. 5జీ సాంకేతికతకు తగ్గట్టుగా స్మార్ట్‌ఫోన్స్ కూడా సాంకేతికత పరంగా మారిపోతున్నాయి. అయితే రానున్న రోజుల్లో 5జీని అధిగమించి 6జీ సాంకేతికత వైపుకు పరుగులు తీయనుంది ప్రపంచం. అందుకు సంబంధించి మొదటి అడుగు కూడా ఇప్పటికే పడింది. 2030 ఆరంభం నాటికే ప్రపంచ వ్యాప్తంగా 6జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని అప్పటికి ఈ స్మార్ట్‌ఫోన్స్, ఇతర హార్డువేర్ పరికరాలు మాయం అయి వాటి స్థానంలో స్మార్ట్‌గ్లాసెస్, శరీరం – మెదడుతో నియంత్రించగలిగే కొత్త పరికరాలు అందుబాటులోకి వస్తాయని పెక్క వివరించారు.

Related posts

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More