విమానాశ్రయం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడు
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులపై జీఎంఆర్ ప్రతినిధుల ప్రజెంటేషన్
భోగాపురం అంతర్జాతీయ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఆపరేషన్స్ 2026, జూన్ నుంచి ప్రారంభించ నున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు అన్నారు. ఎయిర్ పోర్ట్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి జీ ఎం ఆర్ ప్రతినిధులు ఇచ్చిన ప్రెజెంటేషన్ ను పరిశీలించిన అనంతరం మాట్లాడారు.. జీ ఎం ఆర్ వాళ్ళు జూన్ 2026 నాటికి కి ఇది కంప్లీట్ అవుతుందని చెప్పారని ఇంకా ముందే పూర్తి చేయమంటున్నానన్నారు.. 2026 జూన్ 30న వచ్చి దీనిని ఆపరేషన్ చేయాలి. అందుకు పూర్తిగా సహకరిస్తాం. ఈ ప్రాజెక్టును పరిగెత్తిస్తామని వివరించారు.. ప్రస్తుత విశాఖపట్నం ఎయిర్‌పోర్టు 2.8 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందిస్తోందని భోగాపురం ఎయిర్‌పోర్టు 4.5 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించేలా స్టార్ట్ అవుతుంది. దీని కెపాసిటీ 45 మిలియన్ ప్రయాణికులకు సేవలు అందించే అవకాశం ఉంది. అదే సమయంలో రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 2200 ఎకరాలు వీరి అధీనంలో ఉన్నాయి, ఇంకొక 500 ఎకరాలు కూడా ఇవ్వడానికి ఆమోదం తెలుపుతున్నామన్నారు. మొదటి ఎయిర్‌పోర్టును జీఎంఆర్ కు ఇచ్చినప్పుడు చాలా టెస్ట్ జరిపి 20-30 నమూనాలు తయారు చేశారు. అప్పుడే దేశంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టులు వచ్చాయి. హైదరాబాద్‌తో ప్రారంభమైన తర్వాత వీళ్లు అభివృద్ధి చెందారు, దేశం అభివృద్ధి చెందింది. అభివృద్ధికి ఒక మూలంగా, గ్రోత్ ఇంజన్‌గా విమానాశ్రయాల డెవలప్ రూల్ తయారైంది.. భోగాపురం ఎయిర్‌పోర్టుకు సమాంతరంగా మరో 5-6 ఎయిర్‌పోర్టులు కుప్పం, దగదర్తి, నాగార్జునసాగర్ అలాగే మూలపేట కూడా ఆలోచిస్తున్నామన్నారు. ఈ ఎయిర్‌పోర్టుతో విశాఖపట్నం, విజయనగరం కలిసిపోతుంది. ఇక్కడ నుంచి శ్రీకాకుళం కూడా కలిసే అవకాశం ఉంది. ఎందుకంటే శ్రీకాకుళం 50 కిలోమీటర్లు, విశాఖపట్నం 50 కిలోమీటర్లు. ఆ సెంటర్ లో ఈ ఎయిర్‌పోర్టు వస్తోంది. ఫేజ్-1లో భోగాపురం వరకు బీచ్ రోడ్డు, ఫేజ్-2లో ఇంకో 50 కిలోమీటర్లు శ్రీకాకుళం, ఫేజ్-3లో మూలపేట పోర్టు వరకు రోడ్డు నిర్మాణం జరుగుతుంది. దీంతో మూలపేట నుంచి సమాంతర హైవే, బీచ్ రోడ్డు ఇప్పుడున్న హైవేకు అనుసంధానమైతే, మధ్యలో కొన్ని కనెక్టివీలు పెట్టుకుంటే పారిశ్రామికాభివృద్ధికి ఇదొక అద్భుత నగరంగా మారుతుంది. మరే నగరం, ప్రాంతం కూడా దీనికి తలదన్నేలా ఉండవు. ఎప్పట్నుంచో చెబుతున్నా.. ఇదే నా కల. దానిని ఇప్పుడు సాకారం చేసుకునే పరిస్థితి వచ్చిందనిముఖ్యమంత్రి వెల్లడించారు.
రూ.4,700 కోట్లతో ఫేజ్-1 ప్రారంభం
దీనికి అప్పట్లో 2,700 ఎకరాలు అక్వైర్ చేసి 2023 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అయితే వీళ్లు వచ్చి మొత్తం టింకర్ చేశారు. ప్రాజెక్టును ఆడుకునే పరిస్థితికి తెచ్చారు. ఇప్పుడు మరలా మొదటికి వచ్చింది. ఒక 500 ఎకరాలు తీసుకోవడం, లేనిపోని సమస్యలు క్రియేట్ చేశారు. శంకుస్థాపన చేసిన దానికి మళ్లీ శంకుస్థాపన చేశారు. మొత్తానికి వారి పిల్ల చేష్టలు, పిచ్చోళ్ల చేష్టలతో దీన్ని అతలాకుతలం చేసే పరిస్థితికి వచ్చారు. నేటివరకు 31.8 శాతం పనులు పూర్తయ్యాయి.
ఎకనమిక్ హబ్‌గా భోగాపురం..
ఈ ఎయిర్ పోర్టు కనుక పూర్తయితే రాయగఢ్, కోరాపూర్, మల్కన్ గిరి, ఈస్ట్ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి ప్రాంతాలకు అనుసంధానం ఏర్పడుతుంది. రివ్యూలో కొన్ని చిన్న చిన్న సమస్యలను కూడా మా దృష్టికి తీసుకొచ్చారు. ఒకటి నేషనల్ హైవే నుంచి 6 కిలోమీటర్ల మేర రోడ్ కనెక్టివిటీ, పాత నేషనల్ హైవేలో 12 చోట్ల కనెక్టివిటీ, జంక్షన్లను అభివృద్ధి చేయాలి. ఏ ఎయిర్‌పోర్టుకైనా కనెక్టివిటీ చాలా ముఖ్యం. హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రోడ్డు తీసుకొచ్చాం. ఔటర్ రింగ్ రోడ్డు వల్ల ఎక్కడ నుంచి బయలుదేరినా నేరుగా విమానాశ్రయానికి చేరుకోవచ్చు. ఈ భోగాపురం ఎయిర్‌పోర్టును కూడా అదేవిధంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించాం. దీంతో ఈ ప్రాంతం ఒక ఎకనామిక్ హబ్ గా తయారవుతుందని ముఖ్యమంత్రి అన్నారు