మరికొద్ది రోజుల్లో జరగనున్న ఆంధ్రప్రదేశ్ శాశనసభ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి స్పష్టమైన ఆధిక్యత సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని రైజ్ సర్వీస్ సంస్థ తాజాగా చేసిన సర్వే లో వెల్లడైందని ఆ సంస్థ నిర్వాహకుడు ప్రవీణ్ పుల్లాట తెలిపారు. 34 నాలుగు రోజులపాటు 662మందిబృందం 175 నియోజకవర్గాల్లో3,82,576 శాంపిల్స్ తో ఏపీ లోనే అతిపెద్ద సర్వేగా దీన్ని నిర్వహించమన్నారు వెల్లడైన ఫలితాల ప్రకారం కూటమి పార్టీలు 108 నుంచి 120 స్థానాల్లో గెలుపొందే అవకాశం ఉందని సర్వే వెల్లడించింది.. తెలుస్తోంది అధికార వైఎస్ఆర్సిపి 41 నుంచి 54 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే వివరించింది 43 స్థానాల్లో హోరాహోరీ పోరు జరగనుందని తెలిపింది.. చీరాల స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఆమంచి కృష్ణమోహన్ గెలుచుకునే అవకాశం ఉందని రైజ్ సంస్థ పేర్కొంది. తెలుగుదేశం, జనసేన,బీజేపీ లతో కూడిన కూటమి పార్టీలకు 51 శాతం ఓటర్ల మద్దతు లభించగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 44 శాతానికి పరిమితం కానుందని సర్వే తెలిపింది.. అందరి దృష్టి ఉన్న పిఠాపురం లో జనసేనాని పవన్ కళ్యాణ్ ముప్పై ఆరు వేలకు పై చిలుకు మెజార్టీ తో వైసీపీ అభ్యర్థి వంగ గీత పై గెలుపొందనున్నారని సర్వే చెప్పింది. రాయలసీమ మినహా మిగతా అన్ని రీజన్లలలోను కూటమే ఆధిక్యం ప్రదర్శిస్తుందని వివరించింది. అదేవిధంగా లోక్ సభ స్థానాల్లో కూటమికి 18 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నాయని సంస్థ వెల్లడించింది
previous post
next post